బిజినెస్

ఆకట్టుకున్న బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక, 500, 1,000 రూపాయల నోట్ల నిషేధం నేపథ్యంలో బుధవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. గురువారం కోలుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద మొత్తంలో జరుగుతున్న పాత నోట్ల డిపాజిట్లతో మదుపరులు బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 265.15 పాయింట్లు పుంజుకుని 27,517.68 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 93.75 పాయింట్లు ఎగిసి 8,525.75 వద్ద నిలిచింది. అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ చేసిన ప్రసంగం అమెరికాతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లను ఆకర్షించింది. నిజానికి బుధవారం ఆరంభంలో భారీ నష్టాలకు లోనైన సూచీలు ట్రంప్ ప్రసంగం తర్వాతే ఆ నష్టాలను తగ్గించుకోగలిగాయి. ఈ క్రమంలో రాత్రి (్భరత కాలమానం ప్రకారం) అమెరికా మార్కెట్లు, పొద్దున (గురువారం) ఆసియా మార్కెట్లు లాభాల్లో నడవడం భారతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. అంతేగాక నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకే 500, 1,000 రూపాయల నోట్లను రద్దుచేశామని, దీనివల్ల కొత్త అసౌకర్యం కలిగినా, అది తాత్కాలికమేనన్న ప్రభుత్వ వివరణ కూడా మదుపరులకు నచ్చింది. దీంతో బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బిఐ, కెనరా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల విలువ ఏకంగా 13.71 శాతం పెరిగింది.
నిఫ్టీలోనూ బ్యాంకింగ్ షేర్లు 3.49 శాతం మేర లాభపడ్డాయి. ఇక మెటల్, టెలికామ్, యుటిలిటీస్, పవర్, ఫైనాన్స్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లూ లాభాలను అందుకున్నాయి. ఐటి, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టాలకు లోనయ్యాయి.