బిజినెస్

ఎస్‌బిఐకి మొండి బకాయిల దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 11: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే ఏకంగా 99.6 శాతం క్షీణించింది. మొండి బకాయిల కారణంగా కేవలం 20.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 4,991.70 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. స్థూలంగా మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) 4.32 శాతం నుంచి 8.49 శాతానికి ఎగిశాయి. నికర నిరర్థక ఆస్తులు కూడా 2.27 శాతం నుంచి 5.10 శాతానికి ఎగబాకాయి. కాగా, స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ లాభం ఈసారి 34.56 శాతం క్షీణించి 2,538 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 3,879 కోట్ల రూపాయలుగా ఉందని శుక్రవారం బ్యాంక్ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఇదిలావుంటే అనుబంధ బ్యాంకుల విలీనం నేపథ్యంలో భారతీయ మహిళా బ్యాంక్‌సహా ఇతర అనుబంధ బ్యాంకుల భాగస్వాములకు 13.63 కోట్ల షేర్లను ఎస్‌బిఐ జారీ చేసింది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ మైనారిటీ షేర్‌హోల్డర్లకు ఈ షేర్లు దక్కుతాయి.