బిజినెస్

వ్యవసాయాభివృద్ధికి ఎనలేని కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 3: అర్ధ శతాబ్దానికిపైగా వ్యవసాయాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది. 1964 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిన ఈ విశ్వవిద్యాలయం ప్రముఖ పార్లమెంటేరియన్, రైతు నాయకుడు స్వర్గీయ ఆచార్య గోగినేని రంగనాయకులు జ్ఞాపకార్థం 1996 నవంబర్ 7నుండి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మారింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించినప్పటి నుండి విద్యార్థులకు, రైతులకు ఎనలేని సేవలందిస్తూ వ్యవసాయ, ఉద్యాన, పాడిపరిశ్రమ రంగాల్లో బోధన, పరిశోధన, విస్తరణ సేవలను అందించి, 50 ఏళ్ల సుదీర్ఘకాలం తరువాత మరో రెండు విశ్వవిద్యాలయాలకు జన్మనిచ్చింది. దాని ఫలితంగానే శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవిర్భవించాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. ప్రతిష్ఠాత్మకమైన ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరుతో సహా నవ్యాంధ్రప్రదేశ్‌కు దక్కింది. ఈ విశ్వవిద్యాలయం 13 జిల్లాల ప్రజలు, రైతులు, విద్యార్థు లకు సేవలందించేందుకు పునరంకితమవుతోంది. విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలు వ్యవసాయాభివృద్ధికి విశేష సేవలందిస్తున్నాయి. వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్, గృహ విజ్ఞానం, ఇతర అనుబంధ రంగాల్లో మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా శిక్షణ, బోధన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిచేసి ఉత్పాదకతను పెంచేందుకు కృషిజరుగుతోంది. వర్శిటీ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు సాగించిన పరిశోధనల ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లటం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందటానికి వర్శిటీ కృషి చేస్తోంది. విశ్వవిద్యాలయం ఉపకులపతి అధ్యక్షతన 21మంది పాలకవర్గ సభ్యులతో కూడిన పాలకవర్గం లక్ష్యాలకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటూ విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మెరుగైన సేవలందించే ఉద్దేశ్యంతో రాష్టవ్య్రాప్తంగా 865మంది బోధనా సిబ్బంది, 1881 భోధనేతర సిబ్బంది సేవలందిస్తున్నారు. వీరిలో 53మంది ప్రొఫెసర్లు, 188 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 624మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వ్యవసాయ కళాశాలలు, పరిశోధన, విస్తరణ సంస్థల్లో వీరంతా పనిచేస్తున్నారు విశ్వవిద్యాలయంలో వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్, ఆహార సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య వ్యవసాయ యాజమాన్యం విభాగాల్లో బ్యాచులర్ డిగ్రీల్లో ఏటా 977 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తున్నాయి. వీటితోపాటు 24 విభాగాల్లో మాస్టర్ డిగ్రీలు, 17 విభాగాల్లో పిహెచ్‌డి కోర్సులను వర్శిటీ నిర్వహిస్తోంది. ఇంకా రెండేళ్ల వ్యవసాయ విత్తన డిప్లమో కోర్సులు, మూడేళ్ల వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లమో కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా బాపట్ల, తిరుపతి, నైరా, మహానది, రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాలలు, బాపట్ల, మడకశిరలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, బాపట్ల, పులివెందులలో ఆహార సాంకేతిక శాస్త్ర కళాశాలలు, గుంటూరులో గృహ విజ్ఞాన కళాశాల ఉన్నాయి. వర్శిటీ ఆధ్వర్యంలో 14 వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, రెండు వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్‌లు, ఒక విత్తన పాలిటెక్నిక్‌తోపాటు 39 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు నడుస్తున్నాయి. వ్యవసాయాభివృద్ధికి విశేష సేవలందించినందుకు విశ్వవిద్యాలయం అనేక అవార్డులను సొంతం చేసుకుంది. రైతులు, విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం ఎనలేని కృషిచేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చిట్టచివరిసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి స్నాతకోత్సవం సోమవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. విశ్వవిద్యాలయం ఆవిర్భవించిన తరువాత ఇప్పటివరకు హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో రెండు సార్లు మాత్రమే స్నాతకోత్సవాలు జరిగాయి. 45వ స్నాతకోత్సవం తిరుపతిలో, 46వ స్నాతకోత్సవం బాపట్లలో, ఇప్పుడు 47వ స్నాతకోత్సవం రాజమహేంద్రవరంలో జరగనున్నాయి. 48వ స్నాతకోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎవరికి వారు నిర్వహించుకుంటారు. అందుకే చివరి ఉమ్మడి స్నాతకోత్సవాన్ని ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
577 మందికి పట్టాలు పంపిణీ
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవాన్ని సోమవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజు చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2010 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందిన 1,075 మంది విద్యార్ధుల్లో పిజి, యుజి విద్యార్థులతోపాటు పిహెచ్‌డి అభ్యర్థులు 577 మందికి స్నాతకోత్సవంలో పట్టాలు పంపిణీ చేస్తామని, మిగిలినవారికి పరోక్షంగా పట్టాలు అందిస్తామని చెప్పారు.