బిజినెస్

రూ. 50 వేలు మించితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: నగదు డిపాజిట్ల వివరాలను ఆదాయ పన్ను శాఖకు అందించాలని బ్యాంకులు, పోస్ట్ఫాసులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను వారం రోజుల క్రిందట (నవంబర్ 8 రాత్రి) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలో పాత నోట్లను డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశాన్ని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా. పాత నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకుని అంతే విలువ కలిగిన కొత్త నోట్లను పొందవచ్చు. అయితే అక్రమార్కులు కూడా తమవద్దనున్న నల్లధనాన్ని యధేచ్ఛగా మార్చుకునే వీలుండటంతో ఒకేరోజు 50,000 రూపాయలకు మించి లేదా మొత్తం ఖాతాలో 2.50 లక్షల రూపాయలకుపైగా డిపాజిట్ అయినపక్షంలో ఆ వివరాలను ఆదాయ పన్ను శాఖకు తెలియపరచాలని బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ వాణిజ్య, సహకార బ్యాంకులకు, పోస్ట్ఫాసులకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది మోదీ సర్కారు. సేవింగ్స్ ఖాతాల్లో 2.50 లక్షల రూపాయలు, కరెంట్ ఖాతాల్లో 12.50 లక్షల రూపాయలకు మించి డిపాజిట్ అయితే వాటి వివరాలను ఐటి శాఖకు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు ఈ లావాదేవీల వివరాలను నమోదు చేసుకోవాలని, వీటిని వచ్చే ఏడాది జనవరి 31లోగా ఆదాయ పన్ను శాఖకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ (ఎఐఆర్) దాఖలు నిబంధనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించింది. కాగా, ఖాతాదారులు తమ ఖాతాల్లో పదేపదే నగదును డిపాజిట్ చేసుకుని విత్‌డ్రా చేసినా.. దాన్ని గమనించి ఆ వివరాలను పొందుపరచాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే జన్ ధన్ ఖాతాల లావాదేవీలపై ఓ కనే్నయాలని కూడా చెప్పింది. సూచించిన పరిమితి దాటి డిపాజి ట్లు అయతే లెక్కలు చెప్పాల్సి ఉంటుందని, వాటిలో తేడా కనిపించినా, ఆదాయానికి డిపాజిట్‌కు పొంతన లేకపోయనా పన్నుతో పాటు 200 శాతం జరిమానా పడుతుందని కూడా రెవెన్యూ శాఖ చెబుతున్నది తెలిసిందే. నిజానికి ఏడాది మొత్తంలో 10 లక్షల రూపాయలకు మించి లావాదేవీలు జరిగిన ఖాతా వివరాలనే బ్యాంకులు ఐటి శాఖకు తెలియపరచాల్సి ఉంటుంది. మరోవైపు రైతుల ఆదాయంపై అధికారులు వారికి ఉన్న భూములను బట్టి నిర్ధారణకు వస్తారని, బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్న సొమ్మును, భూమిని కలిపి గణిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద రద్దీ ఇంకా తక్కువ కాకపోవడం, రోజూ వచ్చినవారే మళ్లీ మళ్లీ వస్తుండటంతో డిపాజిటర్ల కుడిచేతి చూపుడు వేలుకు ఇంకు మార్కు వేయాలని మంగళవారం ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో నగరాల్లో ఇది బుధవారం నుంచి అమల్లోకి రాగా, పాత నోట్లను డిపాజిట్ చేసినవారికి బ్యాంక్, పోస్ట్ఫాసుల అధికారులు ఇంకు మార్కును పెడుతున్నారు. ఫలితంగా ఆ ఇంకు మార్కు పోయేదాకా సదరు వ్యక్తులు రాకపోయేసరికి రద్దీ కూడా తగ్గుతుందన్నది ఈ ఆలోచన వెనుక ఉన్న పరమార్థం. మొత్తానికి అక్రమార్కుల ఆఫర్లకు తలొగ్గి తమ ఖాతాల్లో ఇష్టారాజ్యంగా డిపాజిట్లు చేస్తే చిక్కులు తప్పవని ప్రభుత్వం తేల్చిచెబుతోంది.

గూగుల్ ఫోటో స్కానింగ్ యాప్
న్యూఢిల్లీ, నవంబర్ 16: టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. బుధవారం ఓ సరికొత్త స్కానింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. ‘గూగుల్ ఫోటోస్కాన్’ను పరిచయం చేసింది. ఇది ఫిజికల్ ఫొటోగ్రాఫ్స్‌ను డిజిటైజ్ చేయడంతోపాటు స్కాన్ చేసేందుకు ఉపకరిస్తుంది. ఈ ఉచిత స్టాండలోన్ యాప్ ద్వారా స్కాన్ చేసుకున్న ఫోటోలను వినియోగదారులు వన్ ట్యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఒఎస్ డివైజ్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌లో కూడా లభించనుండగా, గూగుల్ ఫోటోస్ యాప్‌కు ఎడిటింగ్ టూల్స్‌ను కూడా గూగుల్ సమకూర్చింది. ఈ యాప్‌తో వినియోగదారులు తమకు నచ్చిన చిత్రాలను మరింత అందంగా, మనసును దోచుకునేలా పదిల పరుచుకోవచ్చని ఈ సందర్భంగా గూగుల్ పేర్కొంది.

పాజిటివ్ ఔట్‌లుక్‌తో
భారత్‌కు మూడీస్ రేటింగ్

న్యూఢిల్లీ, నవంబర్ 16: భారత సావరిన్ రేటింగ్‌ను బుధవారం పాజిటివ్ లుక్‌తో ‘బిఎఎ3’గా నిర్ణయించింది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్. రేటింగ్ మరింత పెరగడానికి మరిన్ని ప్రభావవంతమైన ప్రభుత్వ సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. మున్ముందు ఆ దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మూడీస్ వెలిబుచ్చింది. కాగా, బిఎఎ3 రేటింగ్ పెట్టుబడులకు దిగువ శ్రేణిది. దీంతో మూడీస్ తాజా రేటింగ్‌పై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఇంతకుముందు స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) రేటింగ్‌పైనా కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినది తెలిసిందే.

కృష్ణపట్నంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని
పూర్తిచేసిన సెంబ్ కార్ప్ గాయత్రి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణపట్నంలో 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు సెంబ్ కార్ప్ గాయత్రి సంస్ధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1,320 మెగావాట్ల ప్రాజెక్టులో ఇది మొదటి యూనిట్ నిర్మాణమని ఆ సంస్థ స్పష్టం చేసింది. రెండవ యూనిట్ నిర్మాణం వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి పూర్తవుతుందని సెంబ్ కార్ప్ పేర్కొంది.