బిజినెస్

9 నెలల కనిష్టానికి రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనమవుతూనే ఉంది. వరుసగా నాలుగో రోజు నష్టపోతూ 9 నెలల కనిష్టాన్ని తాకింది. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 31 పైసలు క్షీణించి 68.56 రూపాయల వద్ద నిలిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో విదేశీ మదుపరులు భారత్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. వడ్డీరేట్లను పెంచే వీలుందన్న సంకేతాల మధ్య డాలర్ కొనుగోళ్లు పెరిగాయి. దీంతో రూపాయికి డిమాండ్ పడిపోయింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. దీంతో వ్యాపారాలు లేక మార్కెట్లు పడిపోవడం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపిందని నిపుణులు విశే్లషిస్తున్నారు.