బిజినెస్

మిస్ర్తివన్నీ అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: టిసిఎస్‌ను రతన్ టాటా అమ్మేద్దామనుకున్నారంటూ సైరస్ మిస్ర్తి చేసిన వ్యాఖ్యలను టిసిఎస్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్‌సి కోహ్లీ ఖండించారు. గతంలో ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని రతన్ టాటా ప్రతిపాదించినట్లు టాటా సన్స్ చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్ర్తి మంగళవారం ఆరోపించినది తెలిసిందే. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని భారతీయ ఐటి పరిశ్రమ పితామహుడిగా భావించే కోహ్లీ బుధవారం చెప్పారు. ఐబిఎమ్‌కు టిసిఎస్‌ను అమ్మేయాలని టాటా గ్రూప్ ఎప్పుడూ ఆలోచించలేదని ఓ ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. తాను అనారోగ్యం పాలైనప్పుడు రతన్ టాటా టిసిఎస్ విక్రయ ప్రతిపాదనను తెచ్చారంటూ మిస్ర్తి అనడాన్నీ కోహ్లీ తోసిపుచ్చారు.
1984లో తనకు బైపాస్ సర్జరీ అయ్యిందని, 1991-92లో ఐబిఎమ్-టాటా గ్రూప్ జాయింట్ వెంచర్ మొదలైందని గుర్తుచేశారు. కాబట్టి జాయింట్ వెంచర్ సమయంలో తాను బాగానే ఉన్నానన్న కోహ్లీ.. టిసిఎస్‌ను అమ్మే ప్రతిపాదనేదీ అసలు రాలేదని చెప్పారు. మరోవైపు బ్రిటన్‌కు చెందిన కోరస్‌ను అధిక ధరకు కొనుగోలు చేశారన్న దాన్నీ టాటా స్టీల్ మాజీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి ముత్తురామన్ కొట్టిపారేశారు. కోరస్ కొనుగోలు నిర్ణయం చక్కటిదన్న ఆయన కోరస్ కోసం పోటీపడిన సంస్థల్లో తమ తర్వాతి బిడ్డర్‌కు తమకు 50 మిలియన్ పౌండ్ల తేడానే ఉందని చెప్పారు. రతన్ టాటా.. రెట్టింపు ధరకు కోరస్‌ను కొనుగోలు చేయించారని మిస్ర్తి మంగళవారం ఆరోపించినది తెలిసిందే. ఇదిలావుంటే మిస్ర్తి ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన నిర్మల్య కుమార్ మాట్లాడుతూ మిస్ర్తి ఎప్పుడూ తప్పు చేయబోరన్నారు. టాటా గ్రూప్‌లో లోపాలు ఎక్కడున్నాయో మిస్ర్తికి బాగా తెలుసన్న ఆయన తన హయాంలో మాత్రం వాటికి అవకాశం ఇవ్వలేదన్నారు. గత నెల 24న టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తిని తొలగించగా, ఆ తర్వాతి కొద్ది గంటల్లోనే నిర్మల్య కుమార్ కూడా రాజీనామాతో గ్రూప్ నుంచి బయటకు వచ్చారు. మరో ఇద్దరూ ఇదే బాటలో నడిచారు. మరోవైపు టాటా మోటార్స్.. డిసెంబర్ 22న భాగస్వాముల సమావేశానికి పిలుపునిచ్చింది. సైరస్ మిస్ర్తి, నుస్లి వాదియాలను డైరెక్టర్లుగా తొలగించాలని టాటా సన్స్ చేసిన ప్రతిపాదన పరిశీలన కోసమే ఈ సమావేశం.