బిజినెస్

పాత పెద్ద నోట్ల రద్దు .. డెబిట్ కార్డు చార్జీల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో.. కొన్ని వెసులుబాట్లను కల్పిస్తున్నాయి ప్రభుత్వ, బ్యాంకింగ్ వర్గాలు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేలా డెబిట్ కార్డు లావాదేవీల చార్జీలను రద్దు చేయాలని బుధవారం బ్యాంకులకు కేంద్రం సూచించింది. అలాగే ప్రస్తుత రబీ సీజన్‌లో రైతుల నగదు అవసరాల దృష్ట్యా మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రైతులకు సహకార బ్యాంకుల ద్వారా 21,000 కోట్ల రూపాయలను అందించేలా నాబార్డును సిద్ధం చేసింది. ఈ మేరకు ఇక్కడ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. పాత నోట్లను డిసెంబర్ 30లోగా మార్చుకోవచ్చని, బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో వాటిని డిపాజిట్ చేసుకోవాలని తెలిపింది. దీంతో బ్యాంకులు, పోస్ట్ఫాసులతోపాటు ఎటిఎమ్‌ల వద్ద జనం బారులు తీరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో పెట్రోల్ బంకులు, బిగ్ బజార్లలో నగదు ఉపసంహరణలకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అవకాశమిచ్చింది. అంతేగాక పాత నోట్లతోనే పెట్రోల్, బస్సు, రైలు ప్రయాణాలు, ప్రభుత్వ బకాయిల చెల్లింపులకూ వీలు కల్పించింది మోదీ ప్రభుత్వం. అయితే 2,000 రూపాయల నోట్లు బ్యాంకుల నుంచి వస్తుండటంతో చిల్లర సమస్య తలెత్తగా, వ్యాపారాలు స్తంభించిపోతున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్లకు ప్రజలను ప్రోత్సహించాలని బ్యాంకర్లకు ప్రభుత్వం సూచిస్తోంది. అందులోభాగంగానే డెబిట్ కార్డు చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఐసిఐసిఐ, యాక్సిస్, యెస్ బ్యాంకులు వ్యాపారుల కోసం డెబిట్ కార్డు చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయ కూడా. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు డెబిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలుండవని స్పష్టం చేశాయ. కాగా, ఇప్పటికే ఖాతాదారులకు ఏ బ్యాంకు ఎటిఎమ్‌లలోనైనా ఉచితంగానే నగదు ఉపసంహరించుకునే అవకాశం బ్యాంకులు కల్పించాయి. అలాగే ఈ-వాలెట్ల ద్వారా నెలసరి లావాదేవీల పరిమితిని 20,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.