బిజినెస్

మాస్టర్, వీసా కార్డులపై ఎండిఆర్ మాఫీ : ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూపే డెబిట్ కార్డులపై గత వారమే ఎండిఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)ను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) తాజాగా మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై కూడా ఎండిఆర్‌ను మాఫీ చేసింది. ఆర్థిక లావాదేవీల్లో కార్డుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించేందుకు మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండిఆర్‌ను మాఫీ చేస్తున్నామని, ఈ మాఫీ డిసెంబర్ 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్‌బిఐ చైర్మన్ అరుంథతీ భట్టాచార్య గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎండిఆర్‌ను మాఫీ చేయడం ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం బ్యాంకులను ఆదేశించిన నేపథ్యంలో ఎస్‌బిఐ ఈ చర్య చేపట్టింది.