బిజినెస్

భారతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులు గత ఏడాది (2015) భారీగా తగ్గాయి. స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు)గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తం స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివచ్చాయ. ఇక 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. కాగా, గత ఏడాది దేశీయ రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో అత్యధికం ఆసక్తికరంగా ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లోకే వెళ్లాయి. మరోవైపు భారతీయ రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించిన 1992 నవంబర్ నుంచి గమనిస్తే రుణ మార్కెట్లలోకి ఇప్పటిదాకా వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇదిలావుంటే ఆర్థిక సంస్కరణల అమలులో జాప్యం, జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఆందోళనలు, చైనా ఈక్విటీ మార్కెట్ల పతనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు భయాలు వంటివి గత ఏడాది విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ)ను పెట్టుబడులకు దూరం చేశాయి. గత ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది. జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆగస్టులో ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసుకున్నారు. 1997 నుంచి కేవలం ఒక్క నెలలో భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు ఈ స్థాయలో తరలిపోవడం ఇదే (1997కు ముందు సమాచారం లేదు). సెప్టెంబర్‌లోనూ మరో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకున్నారు. అయతే అక్టోబర్ నెలలో తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెల ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది. మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్లలోకి తరలివచ్చాయ. కానీ నవంబర్‌లో విదేశీ మదుపరులు 10,826 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకోగా, డిసెంబర్‌లోనూ 6,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.