బిజినెస్

బలపడిన రూపాయి, పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 25: గత రెండు రోజులుగా వరస పతనంతో సతమతమైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొంతమేర నిలబడింది. ఐటి, ఫార్మా రంగాలు బలంగా నిలదొక్కుకున్న నేపథ్యంలో ఏకంగా 456 పాయింట్లు పెరిగి 26 వేల మార్కుకు చేరుకుంది. అదేవిధంగా అమెరికా డాలర్ విలువతో విలవిల్లాడుతూ వచ్చిన రూపాయి కూడా కొంతమేర పుంజుకోగలిగింది. అక్టోబర్ 18 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు 456 పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి. నేటి లావాదేవీల ప్రారంభంలో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ 26,316.34 పాయింట్లకు చేరుకుంది. అంటే 1.76 శాతం మేర బలపడింది. అలాగే నిఫ్టీ కూడా 148.80 పాయింట్లు పుంజుకుని 8,114.30 వద్ద ముగిసింది. గురువారం అమెరికా డాలర్ విలువతో రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి తాజా సానుకూల పరిణామాల నేపథ్యంలో 27 పైసలు బలపడి 68.46కు చేరుకుంది. డిసెంబర్ సిరీస్‌లో భాగంగా చేపడుతున్న అనేక చర్యలు వివిధ కంపెనీల షేర్లకు ఊతాన్ని ఇచ్చాయి. దీని ఫలితంగా ఫార్మా, ఐటి రంగాలు ముఖ్యంగా ఎగుమతుల ఆధారిత కంపెనీల షేర్లు నిలదొక్కుకున్నాయి. ఒక్కసారిగా రూపాయి బలపడటంతో దాదాపు అన్ని షేర్ల ధరలపై సానుకూల ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. నేటి లాభాల వలన పలు కంపెనీలు గత కొంత కాలంగా చవిచూస్తున్న నష్టాలను కొంతమేర భర్తీ చేసుకోగలిగాయి. ముఖ్యంగా ఐటి దిగ్గజాలైన టిసిఎస్ 5.23 శాతం, ఇన్ఫోసిస్ 4.78 శాతం, విప్రో 3.09 శాతం పుంజుకున్నాయి. ఇక ఫార్మా రంగానికి వస్తే, సన్ ఫార్మా 4.18 శాతం, అరబిందో ఫార్మా 4.07 శాతం, లూపిన్ 3.36 శాతం, సిప్లా 1.75 శాతం బలపడ్డాయి.