బిజినెస్

జిడిపికి దెబ్బ స్వల్పకాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్ద నోట్ల రద్దు వలన భారత దేశ వృద్ధి రేటుపై స్వల్పకాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) క్షీణత ఒక మోస్తరుగా ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘్ఫచ్’ శుక్రవారం పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సర మధ్య కాలం నాటికి భారత దేశ జిడిపి వృద్ధి రేటు చైనా వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉండవచ్చని ‘్ఫచ్’ అంచనా వేస్తూ, సంస్కరణలు, ద్రవ్య విధాన వెసులుబాట్ల దన్నుతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి రేటు వేగాన్ని పుంజుకుంటుందని స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం భారత దేశ వృద్ధి రేటుపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం పడుతుంది. పెద్ద నోట్ల రద్దు వలన తలెత్తిన నగదు కొరత ఎంతకాలం పాటు కొనసాగుతుందన్న దానిపై ఇది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కనుక ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధి రేటు గణాంకాలు క్షీణించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే జిడిపి క్షీణత ఒక మోస్తరుగా ఉంటుందని భావిస్తున్నాం’ అని ఫిచ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డైరెక్టర్ థామస్ రూక్మాకర్ తెలిపారు. అయితే పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని, కనుక జిడిపిపై దాని వాస్తవిక ప్రభావం ఎంత అనే విషయాన్ని అంచనా వేయడం కష్టసాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సంస్కరణల అమలు, గత ఏడాది కాలం నుంచి ద్రవ్య విధానంలో వచ్చిన వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు వేగాన్ని పుంజుకోవడంతో పాటు వౌలిక వసతుల రంగంలో వ్యయం పెరగడం ఖాయమని భావిస్తున్నట్లు రూక్మాకర్ స్పష్టం చేశారు.
జిడిపి తాత్కాలికంగా మందగించినా..
వడ్డీ రేట్లు తగ్గుతాయి : డచ్ బ్యాంక్
ఇదిలావుంటే, పెద్ద నోట్ల ప్రభావం వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు మందగించి 6.5 శాతానికి పరిమితం కావచ్చని భావిస్తున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డచ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే దేశంలో గత కొంత కాలం నుంచి ద్రవ్యోల్బణం స్తబ్దుగా ఉన్నందున వడ్డీ రేట్లు మరింత తగ్గవచ్చని పేర్కొంది. ‘మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్లను తాత్కాలికంగా రద్దు చేయడం వలన ప్రస్తుత త్రైమాసికంతో పాటు తదుపరి త్రైమాసికాల్లో జిడిపి వృద్ధి మందగించి 6.5 శాతానికి పరిమితం కావచ్చు. అయినప్పటికీ మున్ముందు జిడిపి వృద్ధి రేటు పుంజుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి’ అని డచ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.
అవును.. నిజమే : నిర్మలా సీతారామన్
కాగా, పెద్ద నోట్ల రద్దు వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటుపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందన్న వాదనలో నిజముందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుని మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో పాటు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.