బిజినెస్

డిజిటల్ లావాదేవీలే లక్ష్యంగా ఎటిఎంల స్థానంలో సిడిఎంలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 25: రానున్న ఏడాది కాలంలో ప్రస్తుతం ఉన్న ఎటిఎంల స్థానంలో సిడిఎం (క్యాష్ డిపాజిట్ మిషన్)ల ఏర్పాటుకు ప్రాధాన్యనివ్వనున్నట్లు బ్యాంకర్ల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎటిఎంలలో చాలా వరకూ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికి మరమ్మతులతో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కొత్తగా ఎటిఎంల ఏర్పాటు కూడా ఉండకపోవచ్చని, వాటి స్థానంలో సిడిఎంలను ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ ఆలోచిస్తున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు. 2018 ఏప్రిల్ 1వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 85 శాతం ఆర్థిక లావాదేవీలు డిజిటల్ విధానంలో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటికే ఆ తరహా చర్యలకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు ఎటిఎంల నుంచి నగదు తీసుకునే స్థాయి నుంచి తమ వద్ద ఉన్న నగదును ఏ సమయంలోనైనా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించడంలో సిడిఎంలు కీలక భూమిక పోషిస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు డెబిట్‌కార్డు లేని ప్రతి ఒక్కరికీ వాటిని పంపిణీ చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు సైతం పాన్‌కార్డు పొందడం ద్వారా ఎంత మొత్తానికైనా క్రయ, విక్రయాలు చేసుకునేందుకు సిద్ధపడాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు ఇబ్బందిగా అనిపించినా అలవాటైతే సమస్య ఉండదని పేర్కొంటున్నారు. డిజిటల్ లావాదేవీల కారణంగా వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, పరిశ్రమలు, అధిక ఆదాయవర్గాల నుంచి పన్నుల రాబడి పెరుగుతుందని, తద్వారా సామాన్యుడిపై ప్రస్తుతం ఉన్న పన్నుల భారం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదిలోగా 70 శాతం లావాదేవీలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.