బిజినెస్

మిస్ర్తిపై టాటా స్టీల్స్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: టాటా సన్స్ సంస్థ మాజీ అధినేత సైరస్ మిస్ర్తిని టాటా స్టీల్స్ సంస్థ శుక్రవారం తమ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించింది. టాటా స్టీల్స్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ముంబయిలో సమావేశమై చైర్మన్ పదవి నుంచి మిస్ర్తికి ఉద్వాసన పలికింది. అంతేకాకుండా మిస్ర్తి స్థానంలో టాటా స్టీల్స్ తమ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మాజీ అధినేత ఓపి.్భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా నియమించింది. అలాగే డైరెక్టర్ల బోర్డు నుంచి మిస్ర్తితో పాటు స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియాను తొలగించేందుకు వచ్చే నెలలో అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని (ఇజిఎం) నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించిందని, ఈ సమావేశం డిసెంబర్ 21వ తేదీన జరుగుతుందని టాటా స్టీల్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గత నెలలో నాటకీయ పరిణామాల మధ్య టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని అకస్మాత్తుగా తొలగించి, ఆయన స్థానంలో మాజీ అధినేత రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇది మిస్ర్తికి, టాటాలకు మధ్య ఘర్షణకు దారితీసింది. అప్పటి నుంచి టాటా గ్రూపులోని ఇతర సంస్థల్లో అనుభవిస్తున్న పదవుల నుంచి కూడా మిస్ర్తిని తొలగించేందుకు రతన్ టాటా నేతృత్వంలోని టాటా సన్స్ సంస్థ తాత్కాలిక యాజమాన్యం పావులు కదుపుతోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మాజీ అధినేత ఓం ప్రకాష్ భట్

ఇసుజు వాహన కొనుగోలుదార్లకు
పన్ను మినహాయింపు

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో తయారైన తమ వాహనాలను కొనుగోలు చేసిన వారికి మోటారు వాహన పన్ను చెల్లింపున ఉంచి మినహాయింపు ఇచ్చినట్లు ఇసుజు సంస్ధప్రకటనలో తెలిపింది. రవాణా శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం 2021 మార్చి 31వ తేదీ వరకు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో మొట్టమొదటి ఆటోమొబైల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఇసుజు వార్షిక సామర్ధ్యం 50 వేల యూనిట్లని, భవిష్యత్తులో ఈ సంస్ధ ఉత్పాదకతను 1.20లక్షల యూనిట్లకు విస్తరించనున్నట్లు ఆ సంస్ధ తెలిపింది.

నగదు రహిత లావాదేవీలపై
ప్రచారం ప్రారంభం

విజయవాడ, నవంబర్ 25: నగర రహిత లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రచారం లాంఛనంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లాంఛనంగా ప్రారభించారు. పెద్దనోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకు ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్లు, ఇ-పాస్ యంత్రాలతో లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ప్రచారం చేపట్టారు. తొలివిడత శిక్షణలో అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చి ఇన్ బ్యాంకింగ్‌కు చెందిన ప్రొఫెసర్లు ప్రసాద్, అనంతయ్య శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్లు, కళాశాల విద్య స్పెషల్ కమిషనర్, వివిధ బ్యాంక్‌ల ప్రతినిధులు ఆన్‌లైన్‌లో లావాదేవీల గురించి వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఇతర ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు.