బిజినెస్

డేటా సర్వే కాదు... డైనమిక్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా సాధికారత సర్వే.. కుటుంబాలకు సంబంధించిన డేటా సర్వే మాత్రమే కాదని ఇదొక డైనమిక్ సర్వే అని సిఎం సంయుక్త కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. ప్రజాసాధికారత సర్వే 2016ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో జరుగుతున్న పల్స్ సర్వే తీరుతెన్నులను తెలుసుకోవడానికి హర్యానా రాష్ట్రం నుంచి ఒక బృందం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపారు. ప్రద్యుమ్నతోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఎ కూడా హర్యానా బృందానికి పల్స్ సర్వే ఏ విధంగా పని చేస్తుందో వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులను, అంగన్‌వాడీ టీచర్లను ఎన్యూమరేటర్లుగా ఎంపిక చేసి వారికి మండలం, డివిజన్, జిల్లా స్థాయిల్లో 5, 6 సార్లు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ లక్ష మందికి ఇచ్చామని, అనంతరం వీరికి ట్యాబ్‌లు అందించడం జరిగిందన్నారు. దేశంలోనే ఇలాంటి సర్వే ఏ రాష్ట్రంలో జరగలేదని వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకు ముందు అనేక సర్వేలు జరిగాయని, ప్రజాసాధికారత సర్వే ఆధార్ అనుసంధానంగా జరుగుతుందని, ఇది ఫ్యామిలీ బెస్డ్ సర్వే అని, దీని వల్ల డేటా ఖచ్చితత్వంతోపాటు పక్కాగా సమాచారం లభిస్తుందని తెలిపారు. సామాజిక, ఆర్థిక అంశాలు కూడా దీని నుంచి స్వీకరిస్తున్నామని, ఈ స్వీకరణలో కాగితాలను వాడకుండా ఆన్‌లైన్ ద్వారా ట్యాబులతో చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇకెవైసి (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)తో 80 శాతం అనుసంధానించడం జరిగిందని తెలిపారు. 4.13 కోట్ల మంది పల్స్ సర్వేలో తమ వివరాలు అందించారని చెప్పారు. ఈ సర్వేలో డేటాబేస్‌ని అప్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని హర్యానా బృందానికి ప్రద్యుమ్న, కలెక్టర్ తెలిపారు. కుటుంబ వివరాలను ఐరిస్ ద్వారా తీసుకోవడం వల్ల డేటా ఖచ్చితత్వం ఎక్కువగా ఉందని, ఈ సర్వే వల్ల రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలకు కూడా ప్రోత్సహించినటైందని అన్నారు. కుటుంబ వివరాలు పూర్తిగా ఎన్యూమరేటర్‌కు ఇచ్చిన తరువాత మొత్తం డేటా చెక్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని, నవంబర్ చివరికల్లా ప్రజాసాధికారత సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నార న్నారు. సర్వే మొదట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినా, రానురాను అవి సమసిపోయాయని, కుటుంబ వివరాలు నమోదు చేయడానికి మొదట్లో 30 నిమిషాల సమయం తీసుకనేదని, ఇప్పుడు 10 నిమిషాల్లో పూర్తవుతుందని తెలిపారు. అదే విధంగా హర్యా నా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దేవేందర్ సింగ్ పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.