బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ చివర్లో కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.83 పాయింట్లు పుంజుకుని 26,350.17 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.60 పాయింట్లు పెరిగి 8,126.90 వద్ద నిలిచింది. టెలికామ్, పవర్, రియల్టీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బ్యాంకింగ్ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంక్రిమెంటల్ డిపాజిట్లపై సిఆర్‌ఆర్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఊహించనివిధంగా 100 శాతానికి పెంచడమే కారణం. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్, ఐటి రంగాల షేర్లు కూడా నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.97 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.66 శాతం చొప్పున పెరిగాయ. మరోవైపు ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.19 శాతం నుంచి 0.69 శాతం వరకు పెరిగాయి. జపాన్ సూచీ మాత్రం 0.13 శాతం పడిపోయింది. ఇటలీ రాజకీయ అనిశ్చితి మధ్య ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు నష్టపోయాయి.

ఆయిల్ ఇండియా లాభం
రూ. 580 కోట్లు

1:3 బోనస్ షేర్ ప్రకటన

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఒఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 17.7 శాతం క్షీణించింది. 580.27 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 705.67 కోట్ల రూపాయలుగా ఉంది. టర్నోవర్ ఈసారి 2,720.92 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,960.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు సోమవారం సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇదిలావుంటే లాభం తగ్గుముఖం పట్టినప్పటికీ 1:3 బోనస్ షేర్‌ను ఆయిల్ ఇండియా ప్రకటించింది. కాగా, ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారెల్ ముడి చమురుకు 44.55 డాలర్లను ఆయిల్ ఇండియా పొందింది. నిరుడు ఇదే వ్యవధిలో జరిగిన ఉత్పత్తిలో బ్యారెల్‌కు 46.43 డాలర్లు అందుకుంది. గతంతో పోల్చితే ముడి చమురు ఉత్పత్తి 0.8 మిలియన్ టన్నులతో దాదాపు సమానంగా ఉంది. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం 0.702 బిలి యన్ క్యూబిక్ మీటర్ల నుంచి 0.743 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది.

అనంతపూర్‌లో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ, నవంబర్ 28: విండ్ టర్బైన్ తయారీదారు సుజ్లాన్ గ్రూప్.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో 50.40 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ప్రపంచస్థాయి రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా పేరున్న సుజ్లాన్ గ్రూప్.. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చికల్లా ముగించనుంది. ఈ మేరకు వివరాలను సదరు సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సోమవారం తెలిపింది. 2.1 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 24 ఎస్9590ఎమ్ ట్యూబులర్ టవర్ యూనిట్లను అనంతపూర్ వద్ద నిర్మించే ప్రాజెక్టులో సుజ్లాన్ గ్రూప్ ఏర్పాటుచేయనుంది.