బిజినెస్

పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన మెన్స్‌వేర్ బ్రాండ్.. పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ఇక ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులు అమ్మనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి చేనేత కార్మికులతో కలిసి కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్ కమిషనర్ హాండ్లూమ్స్, పీటర్ ఇంగ్లాండ్ ఈ ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ కలెక్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. కాగా, సోమవారం ఇక్కడ టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులను ఆవిష్కరించారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలోగల 15 పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ఈ దుస్తులు లభిస్తాయని 18-20 రకాల మోడల్స్ అందుబాటులో ఉంటాయని, వీటి ధర 1,699 రూపాయల నుంచి మొదలవుతుందని పీటర్ ఇంగ్లాండ్ బ్రాండ్ అధిపతి మనీశ్ సింఘాల్ చెప్పారు. ఇదిలావుంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి 1,600 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలను పెంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

పీటర్ ఇంగ్లాండ్ స్టోర్‌లో ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులను ఆవిష్కరిస్తున్న
కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ

ఫిబ్రవరి 6లోగా
రూ. 600 కోట్లివ్వండి

సహారా గ్రూప్‌తో సుప్రీం కోర్టు
లేకపోతే మళ్లీ జైలుకేనంటూ సుబ్రతా రాయ్‌కి హెచ్చరిక

న్యూఢిల్లీ, నవంబర్ 28: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6లోగా 600 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కి సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. లేనిపక్షంలో తిరిగి జైలుకే వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. మదుపరుల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడంలో సహారా గ్రూప్ విఫలమైతే నిధుల సమీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కోర్టు రంగంలోకి దిగాల్సి వస్తుందని కూడా చెప్పింది. నిజానికి 1,000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని రాయ్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు అత్యున్నత న్యాయస్థానం తెలిపినప్పటికీ, తర్వాత దాన్ని 600 కోట్ల రూపాయలకు తగ్గించింది. మరోవైపు ఈ కేసులో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి 11,136 కోట్ల రూపాయలను సమర్పించడానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌ను సుప్రీం కోర్టుకు ఈ సందర్భంగా సహారా గ్రూప్ అందించింది. నిబంధనలను అతిక్రమించి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు ప్రజల వద్ద నుంచి 20 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు సమీకరించాయన్నదానిపై సహారా-సెబీ మధ్య కేసు నడుస్తోంది. ఈ కేసులో సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో నెలల తరబడి ఉండగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నది తెలిసిందే.