బిజినెస్

కోలుకోని రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 28: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం మరో 30 పైసలు క్షీణించి 68.76 రూపాయలకు చేరింది. శుక్రవారం 68.46 రూపాయల వద్ద ముగిసినది తెలిసిందే. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్.. రూపాయి విలువ దిగజారడానికి దారితీసింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న సంకేతాలు.. కార్పొరేట్ వర్గాల నుంచి డాలర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఇకపోతే దేశీయ మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు కూడా రూపాయిపై ఒత్తిడిని తెచ్చాయి. ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సిఎన్‌ఆర్) డిపాజిట్లపైనా ఈ ప్రభావం కనిపించింది. కాగా, సోమవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ ఒకానొక దశలో 68.80 రూపాయలకి పతనమైంది. అయితే చివర్లో 4 పైసలు కోలుకోగా, 2013 ఆగస్టు 28న మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూపాయి విలువ 68.80 రూపాయల వద్ద నిలిచింది. సోమవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో ఈ స్థాయికి వచ్చినప్పటికీ 68.76 రూపాయల వద్ద స్థిరపడింది. ఇకపోతే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ 3.95 రూపాయలు పడిపోవడం గమనార్హం.