బిజినెస్

పసిడి తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 16 రోజుల తర్వాత సోమవారం తిరిగి తెరుచుకున్న బులియన్ మార్కెట్‌కు పెద్ద షాక్‌నిస్తూ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,750 రూపాయలు క్షీణించింది. కేవలం ఒక్కరోజే ధర ఇంతగా దిగజారడంతో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,400 రూపాయలకు, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,250 రూపాయలకు పడిపోయాయి. వెండి ధర కూడా విపరీతంగా నష్టపోయింది. కిలో ధర 3,100 రూపాయలు తగ్గి 41,600 రూపాయలను చేరింది. బులియన్ మార్కెట్‌లో బంగారం, ఆభరణాల దుకాణాలు ఈ నెల 11 నుంచి మూతపడినది తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమార్కులు తమ అవినీతి సంపదను కాపాడుకోవడానికి బంగారం కొనుగోళ్లను జరుపుతున్నారని ఆదాయ పన్ను శాఖ సర్వేల్లో తేలడంతో బులియన్ మార్కెట్ మూతపడింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తర్వాతి రోజు నుంచి బంగారం షాపుల్లో కొనుగోళ్లు భారీగా పుంజుకున్నాయి. 10 గ్రాముల ధర గరిష్ఠంగా 45 వేల రూపాయలకుపైగా పలకడం గమనార్హం. ఫలితంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఎగవేతదారులకు, అక్రమ లావాదేవీలకు ఊతమిస్తోందని ఐటి శాఖ గ్రహించింది. డరీబా కలాన్, చాందినీ చౌక్, కరోల్ బాగ్ తదితర ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఈ నెల 10న నిర్వహించిన సర్వేల్లో ఈ మేరకు గుర్తించింది. బంగారం లావాదేవీలకు దేశంలోనే పెరెన్నికగల ప్రాంతాలివి. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి బులియన్ మార్కెట్ మూతపడగా, మళ్లీ 16 రోజుల తర్వాత సోమవారమే తెరుచుకుంది. అయితే పసిడి, వెండి ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. బులియన్ మార్కెట్ చివరిరోజైన నవంబర్ 10న 10 గ్రాముల బంగారం ధర 31,150 రూపాయలు, కిలో వెండి ధర 44,700 రూపాయలుగా ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,192.80 డాలర్లు, వెండి ధర 16.80 డాలర్లు పలికాయి.