బిజినెస్

మళ్లీ టోల్‌గేట్ వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: జాతీయ రహదారులపై టోల్‌గేట్ వసూళ్లు మళ్లీ మొదలవుతున్నాయి. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి టోల్‌గేట్ చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకు టోల్‌గేట్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది తెలిసిందే. కాగా, డిసెంబర్ 15 వరకు పాత 500 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. డిసెంబర్ 30లోగా బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో రద్దయిన నోట్లను డిపాజిట్ చేసి, వాటికి సమాన విలువైన కొత్త, ఇతర నోట్లను తీసుకోవచ్చని కూడా చెప్పారు. అయితే ఈలోగా ఆస్పత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, టోల్‌గేట్ల వద్ద చెల్లుబాటు అవుతాయని కూడా స్పష్టం చేశారు. కానీ చిల్లర సమస్య, ట్రాఫిక్ ఇతరత్రా ఇబ్బందుల దృష్ట్యా నవంబర్ 11 వరకు టోల్‌గేట్ చార్జీలను తొలగించిన కేంద్రం.. తదనంతర పరిణామాల మధ్య దీన్ని 14, 18, 24 తేదీల వరకు పొడిగించుకుంటూ పోయింది. అయినా పరిస్థితి మారకపోవడంతో తిరిగి డిసెంబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు నవంబర్ 24న ప్రకటించింది. బ్యాంకులు నగదు బట్వాడాను వేగవంతం చేయడం, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. పెట్రోల్ బంకులు, బిగ్‌బజార్ స్టోర్లు, ఓలా క్యాబ్‌లలోనూ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని తీసుకురావడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 500 రూపాయల నోట్ల సరఫరాను పెంచడం, 100 రూపాయల నోట్ల ముద్రణనూ చేస్తుండటం వంటి వాటితో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని భావిస్తున్న కేంద్రం.. ఇక టోల్‌గేట్ చార్జీల ఎత్తివేతను పొడిగించదల్చుకోలేదు.