బిజినెస్

భాగస్వాముల మద్దతుపై మిస్ర్తి గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: టాటా గ్రూప్ సంస్థల నుంచి సైరస్ మిస్ర్తిని బయటకు పంపించే పనిలో టాటాలు బిజిగా ఉంటే, మరోవైపు ఆయా సంస్థల వాటాదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో మిస్ర్తి మరింత బిజిగా ఉన్నారు. తాజాగా టాటా పవర్ బోర్డు నుంచి పంపేయాలన్న టాటాల ప్రతిపాదనలతో ఆ సంస్థ భాగస్వాముల మద్దతును కోరుతున్నారు మిస్ర్తి. ఈ నెల 26న టాటా పవర్ ఇజిఎమ్ జరగనుంది. సంస్థ డైరెక్టర్‌గా మిస్ర్తిని తొలగించాలన్న టాటా సన్స్ ప్రతిపాదనను ఇందులో పరిశీలించనున్నారు. ఈ క్రమంలో బోర్డు సభ్యుల మద్దతు కోసం మిస్ర్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాగస్వాములకు ఓ లేఖ కూడా రాశారు. కాగా, 2006లో టాటా సన్స్ బోర్డులోకి వచ్చిన సైరస్ మిస్ర్తి.. 2012లో టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రతన్ టాటా పదవీ విరమణతో ఆయన వారసుడిగా వచ్చిన మిస్ర్తి.. అర్ధంతరంగా ఆ పదవికి దూరమయ్యారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా సన్స్‌కు నాలుగేళ్ల క్రితం 2012, డిసెంబర్ 29న రతన్ టాటా స్థానంలో మిస్ర్తి ఎన్నికై ఆశ్చర్యం కలిగించారు. అయితే ఆయన ఎన్నిక ఎంతైతే ఆశ్చర్యానికి గురిచేసిందో.. అంతే ఆశ్యర్యాన్ని ఆయన ఉద్వాసన రేకెత్తించింది. టాటా గ్రూప్ వ్యాపార విస్తరణకు మిస్ర్తి భంగం కలిగిస్తున్నారని, ఆయన నిర్ణయాలు గ్రూప్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని భావించిన టాటాలు అక్టోబర్ 25న టాటా సన్స్ సారథిగా తప్పించారు. అందులో భాగంగానే గ్రూప్‌లోని అన్ని సంస్థల చైర్మన్‌గిరీల నుంచి మిస్ర్తిని టాటాలు తొలగిస్తున్నారు. కాగా, టాటా సన్స్‌లో 18.4 శాతం వాటాను మిస్ర్తి కుటుంబ సంస్థ షాపూర్జి పల్లోంజి గ్రూప్ కలిగి ఉంది.