బిజినెస్

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల నవంబర్‌లో 1 శాతం పెరిగాయి. ఈసారి 91,832 యూనిట్ల విక్రయాలు జరిగితే, పోయినసారి 90,695 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. కాగా, లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) విక్రయాలు గతంతో పోల్చితే 1.5 శాతం వృద్ధి చెందాయి. ఈసారి 51,792 యూనిట్ల అమ్మకాలు జరిగితే, నిరుడు 51,021 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈసారి ప్యాసింజర్ వాహన అమ్మకాలు 64,862 యూనిట్లుగా, వాణిజ్య వాహన విక్రయాలు 26,970 యూనిట్లుగా ఉన్నాయి. ఈసారి ప్యాసింజర్ వాహన అమ్మకాలు పెరగగా, వాణిజ్య వాహన విక్రయాలు తగ్గాయి.

క్షీణించిన హోండా కార్స్ విక్రయాలు
భోపాల్, డిసెంబర్ 10: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ హోండా కార్స్ భారతీయ అమ్మకాలు ఈ నవంబర్‌లో 20-30 శాతం తగ్గుముఖం పట్టాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రిటైల్ మార్కెట్ వ్యాపారం స్తంభించినది తెలిసిందే. ఈ క్రమంలో ఆటోరంగ అమ్మకాలూ పడిపోగా, తమ సంస్థ విక్రయాలు 20-30 శాతం క్షీణించాయని హోండా కార్స్ తెలిపింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇప్పటిదాకా సంస్థ కార్ల అమ్మకాలు దాదాపు లక్ష యూనిట్లుగా నమోదయ్యాయని హోండా కార్స్ ఇండియా డైరెక్టర్ రమణ్ కుమార్ శర్మ విలేఖరులకు చెప్పారు.