బిజినెస్

ద్రవ్యోల్బణానికి నగదు కొరతతో కళ్ళెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తగ్గిన కూరగాయల ధరలు, ఇతరత్రా వంట సరకుల ధరలతో గత నెల టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) దిగివచ్చింది. నవంబర్‌లో 3.15 శాతంగానే నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది మూడో నెల. నిరుడు నవంబర్‌లో మైనస్ 2.04 శాతంగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 3.39 శాతంగా ఉంది.
మరోవైపు చిల్లర ద్రవ్యోల్బణం కూడా శాంతించడం తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల నవంబర్‌లో రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. 3.63 శాతంగానే నమోదైంది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెళ్లాయి. ఇకపోతే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం అంతకుముందు అక్టోబర్ నెలలో 4.20 శాతంగా ఉన్నట్లు మంగళవారం గణాంకాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. కూరగాయల ధరలు 10.29 శాతం పడిపోగా, పప్పు్ధన్యాలు, గుడ్లు, మాంసం, చేపల ధరలూ తగ్గుముఖం పట్టాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినది తెలిసిందే.
ఇదే సమయంలో కొత్త 2,000 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకురాగా, నగదు కొరత, ముఖ్యంగా చిల్లర సమస్యతో వ్యాపారాలు పడిపోయాయి. వినియోగదారుల వద్ద కేవలం 2,000 రూపాయల నోట్లుండటమే దీనికి కారణం. చెలామణిలో 100 రూపాయల నోట్లు తగినంతగా లేక కొనుగోళ్ళు పడిపోగా, డిమాండ్ తగ్గి ఉత్పత్తుల ధరలూ దిగివచ్చాయి. ఫలితంగానే రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలూ తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.