బిజినెస్

మెదక్‌కు ఉద్యాన వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 4: జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), జెఎన్‌టియు, ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలలతో అలరారుతున్న మెదక్ జిల్లాకు మరో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏర్పాటై ఉద్యాన వాణిగా పేరుగాంచనుంది. వ్యవసాయ ఉత్పత్తులపై మంచి నైపుణ్యాన్ని అందించడానికి సుమారు ఐదు వేల మందికి శిక్షణను ఇచ్చే విధంగా వివిధ కేటగిరిల్లో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన ములుగు గ్రామ శివారులోని సుమారు 112 ఎకరాల అటవి భూమిని ఉద్యాన విశ్వవిద్యాలయానికి కేటాయించారు. విశ్వవిద్యాలయం విస్తరణకు 1,832 కోట్లు మంజూరు కానున్నాయి. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్ విశ్వవిద్యాలయం నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేయనున్నారు. గత యేడాది కేంద్ర ప్రభుత్వం ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనల మేరకు గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగులో స్థల సేకరణ చేపట్టారు. మొదటి విడతగా 124 కోట్ల నిధులు విడుదలవగా, ఉద్యాన విశ్వ విద్యాలయానికి 42 కోట్లు, అటవి శాఖకు సంబంధించి 52 కోట్లు, పరిశోధన కేంద్రానికి 30 కోట్లు కేటాయించారు. కాగా, సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో హైదరాబాద్ ఐఐటి నిర్మాణం అవుతుండగా, ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో జెఎన్‌టియును నిర్మిస్తూనే విద్యార్థులకు బోధన నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్‌కల్ మండలం బసంత్‌పూర్ గ్రామ శివారులో ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలను నిర్మించి విద్యార్థులకు బోధన చేస్తున్నారు. రామచంద్రాపూర్ మండలంలో బిహెచ్‌ఇఎల్, పటన్‌చెరు మండలం భానూర్‌లో భారత్ డైనమిక్ లిమిటెడ్ (బిడిఎల్), సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడిఎఫ్) మెదక్ జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువస్తున్నాయి. వ్యవసాయ రంగ పరిశోధనల కోసం పటన్‌చెరు మండలంలో ఇక్రిశాట్‌ను ఏర్పాటు చేసిన శాస్తవ్రేత్తలు కొత్త పరిశోధనలు చేస్తూ వ్యవసాయ సూచనలను రైతులకు అందజేస్తున్నారు. సంగారెడ్డి మండలం అస్తబల్‌లోని ఫల పరిశోధన కేంద్రం.. అనేక రకాలుగా ఉద్యానవన సంపదపై పరిశోధనలు నిర్వహిస్తూ మామిడి తోటల పెంపకంలో మైలురాయిని సాధిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉద్యాన విశ్వవిద్యాలయం రానుంది. ఇది ఉద్యానవన పంటలైన కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వడం, పంటలను పండించే తీరు, ఉపయోగించాల్సిన విత్తనాలు, వాడాల్సిన ఎరువులు, పెస్టిసైడ్స్‌పై అవగాహన కల్పించేందుకు మరింత దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా కొత్తతరం శాస్తవ్రేత్తలను సమాజానికి అందించే సువర్ణ అవకాశం మెదక్ జిల్లాకు దక్కడంపట్ల జిల్లా వాసుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయ.
మరోవైపు జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో మొత్తం 15 గ్రామాల్లో సుమారు 12 వేల ఎకరాల భూ సేకరణ చేసి నిమ్జ్ ద్వారా అనేక పరిశ్రమలను స్థాపించనున్నారు. నిమ్జ్‌లో సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందనున్నారు. పటన్‌చెరు, సంగారెడ్డి, హత్నూర, జిన్నారం, తూప్రాన్, సదాశివపేట, కొండాపూర్, కోహీర్, జహీరాబాద్, పుల్కల్ తదితర మండలాల్లో అనేక పరిశ్రమలు విస్తరించగా మరిన్ని పరిశ్రమలను స్థాపించడానికి ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత జిల్లా కావడంతో కూడా పరిశ్రమల యాజమాన్యాలు మెదక్‌పై ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి శివారు మండలమైన ములుగు కొత్త మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు.