బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లోకి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభమవగా, ఈ మేరకు బుధవారం సంస్థ ప్రకటించింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విజన్‌లో భాగంగా ఈ రెండు రాష్ట్రాలకూ పేమెంట్స్ బ్యాంక్ సేవలను విస్తరించడంపై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండి, సిఇఒ శశి అరోరా ఇక్కడ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు విస్తరించినట్లయంది.
తొలుత రాజస్థాన్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలైనది తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం 15 రోజుల్లో ఒక లక్షకుపైగా సేవింగ్స్ ఖాతాలను బ్యాంక్ తెరిచింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్త సేవలపై ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ దృష్టి పెట్టింది. త్వరలో కర్నాటక తదితర రాష్ట్రాల్లోనూ తమ బ్యాంక్ సేవలు మొదలు కానున్నాయని శశి అరోరా తెలిపారు. ఆంధ్రా, తెలంగాణల్లో దాదాపు 20 వేలు, కర్నాటకలో మరో 15 వేల రిటైల్ ఔట్‌లెట్లను తీసుకొస్తామని చెప్పారు. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 8,000 రిటైల్ ఔట్‌లెట్లు, తెలంగాణలో 7,000 రిటైల్ ఔట్‌లెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. దేశంలో తొలి పేమెంట్స్ బ్యాంక్.. ఎయిర్‌టెల్‌దే. దీన్ని పూర్తిస్థాయలో డిజిటలైజ్ చేశారు. పేపర్ వాడకమనేదే ఉండదు. స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్, బేసిక్ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను కస్టమర్లు పొందవచ్చు. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సేవింగ్స్ ఖాతా తొలి డిపాజిట్లపై రూపాయికి నిమిషం ఎయిర్‌టెల్ టు ఇతర నెట్‌వర్క్‌ల టాక్‌టైమ్ ఆఫర్‌నూ ఎయిర్‌టెల్ ప్రకటించినది తెలిసిందే. రాజస్థాన్ వ్యాప్తంగా 10 వేల ఎయిర్‌టెల్ రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంపైనే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రధానంగా దృష్టి పెట్టింది. రెస్టారెంట్లు, కిరాణా స్టోర్లు, చిన్నచిన్న దుకాణాల భాగస్వామ్యంతోనూ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందించాలని ఎయిర్‌టెల్ యోచిస్తోంది. మొబైల్ ఫోన్లపై డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు వస్తువులను అమ్మేలా వ్యాపారులతో ఒప్పందానికి రానుంది. ఈ ప్రక్రియలో వ్యాపారుల నుంచి ఎలాంటి చార్జీలనూ బ్యాంక్ వసూలు చేయదు. అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకూ ఉచిత సేవలను అందించనుంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. దీనికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు దోహదపడనున్నాయ. ఈ ఏడాది ఏప్రిల్ 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును ఎయిర్‌టెల్ అందుకుంది.