బిజినెస్

హైదరాబాద్‌కు పెట్రోలియం పైపులైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 21: ఒడిశాలోని పారదీప్ నుండి హైదరాబాద్‌కు పెట్రోలియం ఉత్పత్తులు తరలించడానికి 2,000 కోట్ల రూపాయల వ్యయంతో 1,150 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ప్రభుత్వరంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)కు చెందిన కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె అనిల్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రవాణా వ్యవస్థ స్తంభించిపోతోందని, పెట్రో ఉత్పత్తుల రవాణా తలకుమించిన భారం అవుతోందని, దీంతోనే పైపులైన్ నిర్మాణానికి ఐఒసి శ్రీకారం చుట్టిందన్నారు. పారదీప్ నుండి బెరహంపూర్ మీదుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల గుండా ఈ పైపులైన్ నిర్మాణం కొనసాగుతుందని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలో పైపులైన్ల నిర్మాణ ఎలైన్‌మెంట్ పరిశీలన నిమిత్తం బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల మీదు గా పైపులైన్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పైపులైను నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ రీజియన్లు ఏర్పాటు చేశామన్నారు. 16 అంగుళాల పైపులైన్ 1.50 మీటర్ల లోతులో వేసుకుంటూ వెళతారని, రైతు భూముల్లో 18 మీటర్ల వెడల్పు భూమి రైట్ ఆఫ్ యూజ్ కింద తీసుకుంటారని చెప్పారు. రైట్ ఆఫ్ యూజ్ కింద తీసుకున్న భూమి కి మార్కెట్ విలువలో పదోవంతు పరిహారం ఇస్తారని, ఆ భూమిలో పర్మినెంట్ కట్టడాలు నిర్మించరాదని, అయితే నేల చదును చేసుకుని పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఈ 18 మీటర్ల వెడల్పులో రైతులు పంటలు కోల్పోయినా, చెట్లు కోల్పోయినా వాటికి కూడా పరిహారం చెల్లిస్తారన్నారు.
ఐఒసి చీఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజర్ బివిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నిర్మాణం ఆంధ్రాలోని ఆరు జిల్లా ల్లో 675 కిలోమీటర్లు మేర ఉంటుందన్నారు. ఈ పైపులైన్ ద్వారా పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా పంపింగ్ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం రైల్వే వ్యాగన్లు, ట్యాంకర్ల ద్వారా రవాణా జరుగుతోందని, ఈ పైపులైన్ నిర్మా ణం పూర్తయితే రైల్వే ట్రాఫిక్, రోడ్డు ట్రాఫిక్ సమస్య, పర్యావరణ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌గా ఉంటుందన్నారు.