బిజినెస్

ఓవర్ టైమ్ పనిచేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్బోని (పశ్చిమ బెంగాల్), డిసెంబర్ 28: పశ్చిమ బెంగాల్‌లోని సల్బోనిలో గల నోట్ల ముద్రణాలయంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు తాము గురువారం నుంచి రోజుకు తొమ్మిది గంటలకన్నా మించి పనిచేయబోమని అధికారులకు తేల్చిచెప్పారు. ఇదే గనుక జరిగితే ఈ ముద్రణాలయంలో ముద్రించే నోట్ల సంఖ్య తగ్గుతుంది. డిసెంబర్ 14 నుంచి వరుసగా ఓవర్ టైమ్ పనిచేస్తుండటం వల్ల తమ సభ్యుల్లో అనేకమంది అనారోగ్యం పాలయ్యారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్) ఉద్యోగుల సంఘం ఈ మేరకు అధికారులకు బుధవారం నోటీసు ఇచ్చింది. మైసూర్, సల్బోనిల్లో గల కరెన్సీ ముద్రణాలయాలలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారని ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సిసిర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 14నుంచి అధికారులు బలవంతంగా ఉద్యోగులందరి చేత 12 గంటల పాటు సాగే షిఫ్టుల్లో పనిచేయిస్తున్నారు. నోట్లకు, ప్రత్యేకంగా రూ. 500, రూ. 100 నోట్లకు పెరిగిన భారీ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు 24 గంటల పాటు నోట్లను ముద్రించడానికి అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఉద్యోగులు మళ్లీ విధులు నిర్వహించడానికి శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండవలసి ఉందని, అందువల్ల నోట్ల ముద్రణను పెంచడానికి మరింత మంది ఉద్యోగులను నియమించాలని తాము చాలాసార్లు అధికారులకు విన్నవించామని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని సిసిర్ అధికారి తెలిపారు. విరామం లేకుండా 12 గంటల షిఫ్టులో పనిచేయడానికి ఉద్యోగులు బానిసలు కారని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్-సల్బోని ముద్రణాలయంలో ఉద్యోగులను ఒక్కో షిఫ్టులో 12 గంటల చొప్పున రోజుకు రెండు షిఫ్టుల్లో పని చేయిస్తూ రోజుకు సుమారు 96 మిలియన్ల నోట్లను ముద్రిస్తున్నారు. తొమ్మిది గంటల షిఫ్టులో 34 మిలియన్ల నోట్లను ముద్రించవచ్చని అసోసియేషన్ కార్యదర్శి నేపాల్ సింగ్ చెప్పారు. అంటే రెండు షిఫ్టుల్లో కలిపి 68 మిలియన్ల నోట్లు ముద్రించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయతే ప్రస్తుతం ముద్రిస్తున్న నోట్లతో పోల్చితే ప్రతి రోజు 28 మిలియన్ల నోట్ల ముద్రణ తగ్గుతుందని ఆయన వివరించారు. పాత పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, నోట్లకు భారీగా డిమాండ్ ఏర్పడటాన్ని ప్రస్తావించగా, ‘సమస్యలు వస్తాయని మాకు తెలుసు. అకస్మాత్తుగా నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందున ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాలి’ అని అధికారి బదులిచ్చారు. సల్బోనిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 700 మంది బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు. మరోవైపు అసోసియేషన్ ఇచ్చిన నోటీసు దరిమిలా ఏర్పడిన పరిస్థితిపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. ఈ ముద్రణాలయంలో 10 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు అన్ని డినామినేషన్ల కరెన్సీని ముద్రిస్తున్నారు.