బిజినెస్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 4: వ్యవసాయ రంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి వ్యవసాయ పట్ట్భద్రులు, యువ శాస్తవ్రేత్తలు కృషి చేయాలని కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్లూరి పద్మరాజు అధ్యక్షత వహించారు. విద్యార్థులు సమగ్రత, సచ్ఛీలతను అలవరచుకుంటే జీవితంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, దీనికి పక్కా ప్రణాళిక, దానిని సమర్థవంతంగా అమలుచేసే చిత్తశుద్ధి అవసరమన్నారు. దేశంలో వ్యవసాయ రంగం 600 మిలియన్ రైతులకు ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతం వాటాను కలిగి ఉందన్నారు. దాదాపు 50 శాతం దేశ ప్రజలు వ్యవసాయంపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆధారపడుతున్నారని, గత ఐదు దశాబ్దాలుగా పరిశీలిస్తే 1950లో 51 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే, 2014-15 నాటికి 253 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన రైతులు జాతీయ ఆహార భద్రతా సంస్థ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఉద్యాన మిషన్ వంటి సంస్థల కృషి ఫలితంగా అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారన్నారు. దేశంలో 29 శాతం మంది చిన్నారులు తక్కువ బరువు, పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు వివిధ సర్వేలు చెబుతున్నాయని, వ్యవసాయ పట్ట్భద్రులు ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 320 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామని, దీనిని సాధించటంలో యువ శాస్తవ్రేత్తలు కీలకపాత్రను పోషించాలన్నారు. ఉద్యాన పంటల్లో ‘చమన్’ అనే కార్యక్రమం ద్వారా ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర వ్యవసాయశాఖ కృషి చేస్తోందని తెలిపారు. కాగా, సిరాజ్ హుస్సేన్‌కు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి, పిజి, యుజి కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 577 మంది విద్యార్థులకు ఆయన పట్టాలు పంపిణీ చేశారు. వీరి తోపాటు 26 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఉత్తమ అధ్యాపకులు, శాస్తవ్రేత్తలకు అవార్డులనూ అందించారు.

హుస్సేన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న దృశ్యం