బిజినెస్

1955 కాల్‌డ్రాప్స్ నివారణకు టోల్-ఫ్రీ నెంబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మొబైల్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన కాల్‌డ్రాప్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఓ సమీకృత కంఠ స్పందన వ్యవస్థ (ఐవిఆర్‌ఎస్)ను ప్రారంభించింది. కాల్స్ నాణ్యతపై వినియోగదారుల నుంచి ఈ వ్యవస్థకు నేరుగా స్పందనలు అందుతాయి. ఢిల్లీ, ముంబయి, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవాల్లో ఈ వ్యవస్థను ఈ నెల 23న కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని బుధవారం ఓ అధికారిక ప్రకటనలో మోదీ సర్కారు స్పష్టం చేసింది. కాగా, 1955 నెంబర్ నుంచి ఓ ఐవిఆర్‌ఎస్ కాల్ వినియోగదారులకు వస్తుందని, కాల్‌డ్రాప్స్‌ను ఎదుర్కొంటున్నారా? అని ప్రశ్నిస్తుందని, దీనికి సమాధానం చెబితే అది రికార్డ్ అవుతుందని సదరు ప్రకటన తెలిపింది. అలాగే 1955 నెంబర్‌కు మొబైల్ వినియోగదారులే నేరుగా తమ కాల్‌డ్రాప్స్ సమస్యలపై టోల్-ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా పంపుకోవచ్చు. అయితే నగరం, పట్టణం, గ్రామం పేరును పేర్కోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా టెలికామ్ సంస్థలతో కాల్‌డ్రాప్స్‌ను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.