బిజినెస్

దుబాయ్ గోల్డ్ మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 28: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం దుబాయ్ గోల్డ్ మార్కెట్‌కు తగిలింది. దుబాయ్‌లో బంగారానికి ప్రధాన మార్కెటైన ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ సౌక్‌లో ఇప్పుడు భారతీయ కస్టమర్లే కనిపించడం లేదుమరి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే. నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారతీయుల కొనుగోళ్లతో ఎప్పుడూ కళకళలాడే దుబాయ్ గోల్డ్ సౌక్.. కళతప్పింది. ఓ మీడియా నివేదిక ప్రకారం ఈ సుప్రసిద్ధ మార్కెట్‌లోని ప్రతీ దుకాణాన్ని పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్రంగానే తాకింది. నవంబర్ 8 నుంచి భారతీయులు కొనుగోళ్లు జరిపిన దాఖలాలు దాదాపుగా లేవని ఇక్కడి స్కై జ్యుయెల్లరీ షాపు జనరల్ మేనేజర్ సిరియక్ వర్ఘీస్ తెలిపారు. ఇక గోల్డ్ సౌక్ కాకుండా దుబాయ్‌లో పసిడి అమ్మకాలుండే బుర్ దుబాయ్ ప్రాంతంలో కూడా భారతీయుల కొనుగోళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. గత 50 రోజుల్లో ఇక్కడి దుకాణాలను సందర్శించిన భారతీయ కస్టమర్లు లేరనే చెప్పాలని గల్ఫ్ న్యూస్‌కు వర్ఘీస్ చెప్పారు. సాధారణంగా దుబాయ్ మార్కెట్‌లో భారతీయుల బంగారం కొనుగోళ్లు దాదాపు 15-20 శాతంగా ఉంటాయి. ధరలు తక్కువగా ఉంటే కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. కానీ పాత పెద్ద నోట్ల రద్దు ఈ కొనుగోళ్లను ప్రభావితం చేసింది. అయితే ఈ రెండు నెలల్లో భారతీయుల కొనుగోళ్లు తగ్గినప్పటికీ.. చైనీయుల కొనుగోళ్లు పెరిగాయని, ఇది కొంత ఊరట కలిగించే అంశంగా ఇక్కడి రిటైల్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కానీ భారతీయులు 22 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే, చైనీయులు 18 క్యారెట్ల బంగారాన్ని కొంటారని చెబుతున్నాయి. కాగా, పాత పెద్ద నోట్ల రద్దుతో చేతిలో కావాల్సినన్ని కొత్త నోట్లు లేకపోవడమేగాక, ఉన్న పాత నోట్లు చెల్లుబాటుకాని పరిస్థితి నెలకొందని, ఈ విషయంలో స్థానిక నగదు మార్పిడి కేంద్రాలు కూడా సహాయం చేయలేని దుస్థితి ఏర్పడిందని దుబాయ్ గోల్డ్ అండ్ జ్యుయెల్లరీ గ్రూప్ బోర్డు సభ్యుడు అబ్దుల్ సలామ్ కెపి అన్నారు. భారత్ నుంచి దుబాయ్‌కి వచ్చినవారు తమ దగ్గర పరిమితికి మించి కరెన్సీ ఉంటే దాన్ని బంగారం, నగలుగా మార్చుకునేవారని, అయితే పాత పెద్ద నోట్ల రద్దుతో ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇక ప్రస్తుతం తాము రద్దయిన భారతీయ కరెన్సీని కొనుగోళ్లకు అంగీకరించడం లేదని జాయ్ అలుక్కాస్ గ్రూప్ డైరెక్టర్ ఆంటోనీ జోస్ స్పష్టం చేశారు. మొత్తానికి మోదీ పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దుబాయ్ గోల్డ్ మార్కెట్‌ను కుదేలు చేసింది. ఇన్నాళ్లూ తమ దగ్గరున్న నల్లధనంతో ఎడాపెడా బంగారాన్ని కొనేసిన అక్రమార్కులకూ చెక్ పెట్టినట్లైంది.
chitram...
కొనుగోళ్లు లేక వెలవెలబోతున్న గోల్డ్ సౌక్ మార్కెట్‌లోని ఓ దుకాణం