బిజినెస్

దివీస్, జిఎంఆర్‌లకు నిరసనల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 31: తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ప్రజల భద్రతకు తిలోదకాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ యంత్రాంగం.. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో పోలీసు బలగాలను మొహరించి, తమ అభిప్రాయాలను కూడా వెల్లడించలేని భయంకరమైన పరిస్థితులను కల్పించారంటూ ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కూలి, కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సుమారు దశాబ్దం క్రితం కాకినాడ తీరంలోని యు కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో దాదాపు 10వేల ఎకరాల భూములను రిఫైనరీ ఆధారిత ఎస్‌ఇజడ్ నిర్మాణం పేరుతో భూములను అప్పటి ప్రభుత్వం సేకరించింది. తరువాత నిబంధలకు విరుద్ధంగా భూములను ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఆ తర్వాత సదరు భూమి కార్పొరేట్ సంస్థల చేతులు మారింది. ఇదంతా ఒక ఎత్తయితే, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎస్‌ఇజడ్ భూముల్లో కంపెనీలు స్థాపించుకునేందుకు కార్పొరేట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా సంస్థలు కంపెనీల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఇక్కడే అసలు వివాదం మొదలయ్యింది. ప్రజాభిప్రాయ సేకరణను నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరుపుతున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టులో జిఎంఆర్ ఆధ్వర్యంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధిత గ్రామాల ప్రజలకు సమాచారం అందించకపోవడం వివాదాస్పదంగా మారింది. ప్రజాభిప్రాయం అనగానే ఆయా ప్రాంతాల ప్రజలందరికీ విధిగా సమాచారం అందించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా పరిమిత సంఖ్యలో అభిప్రాయాలను సేకరించి, చేతులు దులుపుకున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిఎంఆర్ సంస్థ తొండంగి మండలంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను పోర్టు నిర్మాణ ప్రతిపాదిత స్థలంలోనే ఏర్పాటుచేశారు. అయితే ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీల నేతలను వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. అలాగే సరిగ్గా పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన రోజు పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సుమారు 50 మంది ఆందోళనకారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసి, పెద్దాపురం ఆర్‌డిఒ కార్యాలయానికి హాజరయ్యేలా చేశారు. ఓ పథకం ప్రకారం ఆందోళనకారులను ఆర్డీవో కార్యాలయానికి రప్పించి, సాయం త్రం వరకు వారిని అక్కడే నిరీక్షించేలా చేశారు. అదే సమయంలో తీర ప్రాంతంలో పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతో అధికారుల వ్యూహం తెలుసుకుని ప్రజలు అవాక్కయ్యారు. ఇక తొండంగి మండలంలోనే దివీస్ మందుల ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందుల ఫ్యాక్టరీ నిర్మాణంతో ఈ ప్రాంతం కాలుష్యభరితంగా మారిపోతుందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీ నిర్మాణాన్ని మత్స్యకారులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాణాలకు ముప్పు కలిగించే మందుల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.