బిజినెస్

గార్మెంట్ ఇండస్ట్రీ అభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 31: ఏపిలో స్పిన్నింగ్ మిల్లుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్‌లతోపాటు వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ రంగాల అభివృద్ధికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు. శనివారం సాయంత్రం అమరావతిలోని (వెలగపూడి) ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తనను కలిసిన ఏపి స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి పరిశ్రమ బాగోగులపై చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో పత్తి పంట పండే భూమి తెలంగాణ భూభాగానికి, పరిశ్రమ అంతా ఆంధ్రప్రదేశ్‌లో ఉండిపోవటం వల్ల అనివార్యంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని వారు ముఖ్యమంత్రికి వివరించారు.
అయతే రాయలసీమలో పత్తి పంటకు విస్తృతమైన అవకాశం ఉందని ప్రభుత్వం ప్రోత్సహిస్తే వేలాది ఎకరాలలో పత్తి పంటను సాగుచేసేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని అసోసియేషన్ చైర్మన్ సుధాకర్ చౌదరి ముఖ్యమంత్రికి వివరించారు. కరవు జిల్లాల్లో పత్తి పంట సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తామని, రెయిన్ గన్స్ ఉపయోగించి రెండు తడులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. జిన్నింగ్, స్పిన్నింగ్‌తోపాటు ఏపిలో వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ విభాగాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా గార్మెంటింగ్ పరిశ్రమల స్థాపన వల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ముంబయ, నెల్లూరు, చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాల్లో వేళ్లూనుకుని ఉన్న రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావటానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఇది ఒక స్పెషలైజ్డ్ ఇండస్ట్రీగా మారగలదన్న అసోసియేషన్ ప్రతినిధుల అభిప్రాయాలతో ముఖ్యమంత్రి ఏకీభవించారు.
కాగా, పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమ పరిశ్రమపై ఏ మాత్రం లేదని, తాము డిజిటల్ చెల్లింపుల ద్వారా తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ జీతాలు మొదటివారంలోనే అందిస్తున్నామని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. 125 స్పిన్నింగ్ మిల్లులు, వాటిపై ఆధారపడి 2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పున్నయ్యచౌదరి, ధర్మతేజ, సుధాకర్ చౌదరి తదితరులున్నారు.