బిజినెస్

కొనుగోళ్ల ఉత్సాహం (వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో 2016 సంవత్సరానికి వీడ్కోలు పలికాయి. అంతకుముందు రెండు వారాల్లో నష్టాలను చవిచూసిన సూచీలు.. గడచిన వారం మాత్రం లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 585.76 పాయింట్లు ఎగిసి 26,626.46 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 200.05 పాయింట్లు ఎగబాకి 8,185.80 వద్ద నిలిచింది. అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 706.48 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 276 పాయింట్లు పతనమైంది. అయితే గడచిన వారం మాత్రం కోలుకోగలిగాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెట్టుబడులకు వెనుకాడిన మదుపరులు.. బ్యాంకుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్‌కున్న గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ పెట్టుబడులకు ముందుకు రావడం గమనార్హం. శుక్రవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకున్నాయి.
ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి, చమురు, గ్యాస్, ఆటో, పవర్, పిఎస్‌యు, క్యాపిటల్ గూడ్స్, మెటల్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 5.41 శాతం నుంచి 1.07 శాతం మేర లాభపడ్డాయి. ఐటిసి, హిందుస్థాన్ యునిలివర్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, విప్రో, లుపిన్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్ల విలువ 7.18 శాతం నుంచి 2.01 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలోనే బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 2.39 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ సూచీ 2.11 శాతం పెరిగింది. ఇక టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 11,869.82 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 77,385.17 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 12,523.76 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 71,531.91 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు 2016లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గతంతో పోల్చితే తక్కువ లాభాలతో సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 508.92 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239.45 పాయింట్లు అందిపుచ్చుకుంది. 2016లో సెనె్సక్స్ ప్రయాణం 26,117.54 వద్ద మొదలవగా, 26,626.46 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 7,946.35 వద్ద తన ప్రయాణాన్ని ఆరంభించగా, 8,185.80 వద్ద నిలిచింది. పడుతూ.. లేస్తూ సాగిన పయనంలో భారతీయ స్టాక్ మార్కెట్లను విదేశీ మదుపరుల పెట్టుబడులు (ఎఫ్‌పిఐ లేదా ఎఫ్‌ఐఐ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలు, ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు, ఎగుమతి-దిగుమతుల గణాంకాలు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర సంస్కరణలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, అమెరికా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు, అగ్రరాజ్య అధ్యక్షుడి ఎన్నికలు, యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ నిష్క్రమణ, ఈయులో సభ్యత్వంపై గ్రీస్ రెఫరెండమ్, సంస్కరణలపై ఇటలీ ప్రజాభిప్రాయ సేకరణ, పాత పెద్ద నోట్ల రద్దు, ఆర్‌బిఐ కొత్త గవర్నర్ నిర్ణయం, టాటా-మిస్ర్తిల వివాదం వంటివి ప్రభావితం చేశాయ. ఇక 2016లో సెప్టెంబర్ 8న సెనె్సక్స్ 29,077.28 పాయింట్ల గరిష్ఠ స్థాయని అందుకుంటే, ఫిబ్రవరి 29న 22,494.61 పాయింట్ల కనిష్ట స్థాయని చవిచూసింది. అలాగే సెప్టెంబర్ 7న నిఫ్టీ 8,968.70 పాయింట్ల గరిష్ఠ స్థాయని తాకితే, ఫిబ్రవరి 29న 6,825.80 పాయింట్ల కనిష్ట స్థాయని చూసింది. ఇదిలావుంటే 2016లో భారతీయ మార్కెట్లలోకి 83 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపిఒ) వచ్చాయి. ఈ సంస్థలు 3.8 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాయి. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా ఖజానాకు 34,800 కోట్ల రూపాయలు వచ్చాయ.