బిజినెస్

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్పంగా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలో నెలకొన్న మందగమనం మధ్య విదేశీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆరంభంలో భారతీయ సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ, మార్కెట్ ముగిసే సమయం దగ్గరపడుతున్నకొద్దీ నష్టాలు తప్పలేదు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 10.11 పాయింట్లు కోల్పోయి 26,633.13 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.75 పాయింట్లు చేజార్చుకుని 8,190.50 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలోనూ హాంకాంగ్ సూచీ నష్టపోగా, జపాన్, చైనా సూచీలు మాత్రం లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లు నష్టపోయాయి.
హైదరాబాద్‌లో
సరకు రవాణాకు ఆన్‌లైన్ వేదిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: ఆన్‌లైన్ వేదికగా సరకు రవాణా సేవలు అందిస్తున్న లోడ్ 24/7.. తమ సేవలను హైదరాబాద్‌కు విస్తరించింది. ఆ సంస్థ డైరెక్టర్ లోకేష్ కుమార్ గుప్తా ఈ మేరకు బుధవారం ఇక్కడ చెప్పారు. హైదరాబాద్ నుంచి తమకు నెలకు 400 నుంచి 500 ఆర్డర్లు వస్తున్నాయన్నారు. దీంతో హైదరాబాద్‌కు సేవలను విస్తరించామని, అయతే పూర్తిస్థాయిలో ఈ ఏడాది జూన్ నుంచి ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తమ సంస్థ రవాణాదారులు, సరకుల యజమానుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎండ్ టు ఎండ్ అవసరాలను భర్తీ చేస్తున్నామన్నారు. వినియోగదారుల వస్తువులను వేరే చోటికి తరలించే సదుపాయంతోపాటు, వాటిని ప్యాకింగ్ చేసే సదుపాయాన్ని ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఆప్షన్ ద్వారా పొందవచ్చన్నారు. ప్రస్తుతం తమ ఆన్‌లైన్ వేదిక.. దేశంలోని 20 వేల రిజిస్టర్డ్ మొబైల్ వినియోగదారులు, 50 వేల ట్రాన్స్‌పోర్టర్లు, 5,100 ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ను కలిగి ఉందన్నారు. టిసిఎస్, జిందాల్ వంటి ప్రముఖ సంస్థలు తమ సేవలను వినియోగించుకుంటున్నట్లు ఆయన చెప్పారు.