బిజినెస్

టర్మరిక్ స్పైస్ పార్క్‌కు మరో రూ. 15 కోట్లు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: నిజామాబాద్ జిల్లా పడిగల్‌లో ఏర్పాటు చేస్తున్న టర్మరిక్ స్పైస్ పార్క్‌కు వచ్చే బడ్జెట్‌లో 15 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల వ్యవధిలో బాల్కొండ ఎమ్యెల్యే ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పోచారం సమాధానం ఇస్తూ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కార్పొరేషన్ ద్వారా స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 15 కోట్లు కేటాయించగా, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మరో 15 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. భద్రాది కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మైనింగ్ విశ్వవిద్యాలయానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరు పెట్టాలని కాంగ్రెస్ సభ్యుడు జి చిన్నారెడ్డి సూచించారు. అయతే రాష్ట్రంలో మైనింగ్ కాలేజీ ఒక్కటే ఉండటంతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిబంధనలు ఒప్పుకోవని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. అయినప్పటికీ మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లో
డైకిన్ స్మార్ట్ స్టూడియో

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 4: డైకిన్ ఎయర్ కండీషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (డిఎఐపిఎల్).. బుధ వారం హైదరాబాద్‌లో తమ తొలి స్మార్ట్ స్టూడియోను ప్రారంభించింది. జపాన్‌కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయన డిఎఐపిఎల్.. భారతీయ ప్రీమియం ఎయర్ కండీషనింగ్ మార్కెట్‌లో దూసుకెళ్తోంది. జూబ్లీహిల్స్‌లోని లో టస్ పాండ్ వద్ద తమ నూతన స్మార్ట్ స్టూడియోను డైకిన్ ఆవిష్కరించింది. ఎయర్ కండీషనింగ్‌లో కస్టమర్లు తమకు కావాల్సిన అన్నింటినీ ఇక్కడ పొందవచ్చని సంస్థ తెలిపింది. కాగా, దేశంలో ఏసి యంత్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడవ ఏసి యంత్రాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డైకిన్ చెప్పింది. దీని కోసం దేశంలో అనువైన ప్రాంతాలను ఆనే్వషిస్తున్నట్లు సంస్థ ఎండి కన్వాల్‌జీత్ జావా తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. రాజస్తాన్‌లోని నీమ్రానాలో ఒక ప్లాంట్ ఉందని, మరో ప్లాంట్‌ను కూడా ఇక్కడే నెలకొల్పామన్నారు.
ఇక్కడ 40 ఎకరాల స్థలంలో 600 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాలీనా 12 లక్షల ఏసి మెషీన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. 2018 నాటికి దేశంలో ఏసి మెషీన్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్నారు. తమ సంస్థ వార్షిక టర్నోవర్ 2,750 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. ఈ ఏడాది టర్నోవర్ రూ. 3,500 కోట్లకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ కంపెనీకి దేశంలో నాలుగు వేల మంది డీలర్లు ఉన్నారని, 2020 నాటికి పదివేల మంది డీలర్లను నియమించనున్నట్లు చెప్పారు.

స్టూడియో ప్రారంభోత్సవ దృశ్యం

టాటా పవర్ చైర్మన్‌గా
పద్మనాభన్
న్యూఢిల్లీ, జనవరి 4: టాటా పవర్ చైర్మన్‌గా ఎస్ పద్మనాభన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం టాటా పవర్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పద్మనాభన్ పేరును సిఫార్సు చేసినట్లు చెప్పింది. తక్షణమే పద్మనాభన్ నియామకం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. సైరస్ మిస్ర్తి రాజీనామా నేపథ్యంలో టాటా పవర్‌లోకి పద్మనాభన్‌ను టాటాలు తీసుకొచ్చారు.
కాగా, గత నెలే పద్మనాభన్ టాటా పవర్ బోర్డులోకి అదనపు డైరెక్టర్‌గా వచ్చారు. అంతకుముందు ఈయన టాటా బిజినెస్ ఎక్స్‌లెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవలే టాటా సన్స్ గ్రూప్ హెచ్‌ఆర్ అధిపతిగా కూడా పద్మనాభన్ అదనపు బాధ్యతలు తీసుకున్నారు.

27 శాతం పెరిగిన ఎఫ్‌డిఐ
న్యూఢిల్లీ, జనవరి 4: దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-అక్టోబర్‌లో 27.82 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 21.87 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. దీంతో 27 శాతానికిపైగా వృద్ధిరేటు కనిపించిందని పారిశ్రామిక విధాన, ప్రగతి శాఖ (డిఐపిపి) తెలియజేసింది. సర్వీసెస్, టెలికామ్, ట్రేడింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆటోమొబైల్ రంగాల్లోకి ఎఫ్‌డిఐ ఈసారి అధికంగా వచ్చినట్లు డిఐపిపి వెల్లడించింది. సింగపూర్, మారిషస్, నెదర్లాండ్స్, జపాన్ దేశాల నుంచి ఎక్కువగా వచ్చినట్లు పేర్కొంది.

నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ అభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ, జనవరి 4: టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. బుధవారం వివాదాస్పద నెట్-న్యూట్రాలిటీ అంశంపై చివరి సంప్రదింపులను ప్రారంభించింది. ఈ మేరకు ఓ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. టెలికామ్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ వినియోగదారుల మధ్య నెట్-న్యూట్రాలిటీపై పెద్ద రగడే జరుగుతున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని పరిష్కరించేందుకు నడుం బిగించిన ట్రాయ్.. తుది అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. వచ్చే నెల 15లోగా తమ అభిప్రాయాలను అందరూ తెలియజేయవచ్చని, కౌంటర్ కామెంట్లకు గడువు 28 అని పేర్కొంది.