బిజినెస్

దేశ పటిష్ఠతతోనే అధికార సమతుల్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 7: ప్రపంచంలో అధికార సమత్యులతను సాధించడానికి భారత్ పటిష్ఠమైన దేశంగా, మరింత ప్రభావశీలమైన దేశంగా ఎదగవలసిన అవసరం ఉందని దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మిఖాయెల్ అశ్విన్ అధిన్ అన్నారు.
భారత్ మరోసారి ‘విశ్వగురు’గా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాగే 14వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమం దేశంలో అతి పెద్ద ఐటి హబ్ అయిన బెంగళూరు నగరంలో శనివారం ప్రారంభం అయింది. ‘సమాజ పరివర్తనలో యువత పాత్ర’, మళ్లీ ‘విశ్వగురు’ పాత్రను నిర్వహించడంలో భారత్ సామర్థ్యం అనే అంశాలు ఈ కార్యక్రమంలో కేంద్రీకృత అంశాలుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరిగి పెద్దవారవుతున్న భారతీయ సంతతికి చెందిన కొత్త తరం యువతతో అనుసంధానం కావాలనే లక్ష్యంతో పిబిడి 2017లో భాగంగా ఈ ‘యువజన ప్రవాసి భారతీయ దివస్’ ప్రారంభమయింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో అధిన్ మాట్లాడుతూ భారత్ సూపర్ పవర్‌గా ఎదగగలుగుతుందని, ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ఎదగగల సత్తా భారత్‌కు ఉందని అన్నారు. కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికె సింగ్ మాట్లాడుతూ అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి అజరామరంగా విరాజిల్లుతున్న భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా గల తన సంతతి యువత భవిష్యత్తుకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
ఈ అంశమే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గల భారతీయ సంతతి ప్రజలను ఒకటిగా ఉంచుతోందని అన్నారు. 2015 యువజన పిబిడి మూడు సిలు- కనెక్ట్, సెలబ్రేట్, కంట్రిబ్యూట్- అనే అంశాలతో జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు జరుగుతున్న యువజన పిబిడి 2017లో నాలుగు టిల ద్వారా భారతదేశంతో పాటు మీ జీవితాలను పరివర్తన చేసుకొని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన ప్రవాస భారతీయ యువతకు పిలుపునిచ్చారు. నాలుగు టిలను ట్యాలెంట్ (ప్రతిభ), టెక్నాలజి (సాంకేతిక పరిజ్ఞానం), ట్రైనింగ్ (సుశిక్షణ), టీమ్‌వర్క్ (సమష్టి పని)గా ఆయన అభివర్ణించారు.

శనివారం బెంగళూరులో ప్రారంభమైన ‘యువజన ప్రవాసి భారతీయ దివస్’
వేదికపై సురినామ్ దేశ ఉపాధ్యక్షుడు మిఖాయెల్ అశ్విన్ అధిన్‌తో కరచాలనం
చేస్తున్న కేంద్రమంత్రి విజయ్‌గోయెల్. చిత్రంలో కేంద్రమంత్రి వి.కె.సింగ్,
కర్నాటక మంత్రి దేవ్‌పాండేలు కూడా ఉన్నారు