బిజినెస్

భాగ్యనగరంలో ఔషధ నగరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: హైదరాబాద్ సిగలో ఔషధ నగరి చేరబోతోంది. వచ్చే 15 రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాత ఔషధ నగరి (్ఫర్మాసిటీ) కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. కొత్తగా వచ్చే ఔషధ నగరిలో నెలకొల్పనున్న వౌలిక సదుపాయాల వివరాలతో ఈ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసే బాధ్యతను ఆసియాలోనే అతిపెద్ద కనె్సల్టెన్సీ సంస్థ, సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్‌కు అప్పగించారు. 2018 నాటికి ఫార్మాసిటీ మొదటి దశను పూర్తి చేయలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉన్నారు. దీని నిమిత్తం భూ సేకరణ పనులు వేగవంతమవుతున్నాయి. తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) రంగారెడ్డి జిల్లాలో 18,782.20 ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఇందులో 5,640 ఎకరాలను ఇప్పటికే సేకరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి సేకరణకు తొలిసారిగా ద్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో ఫోటోగ్రామెట్రిక్ సర్వే చేశారు. ఫార్మా పరిశోధన సంస్థలు, ఫార్ములా తయారీ కేంద్రాలు, ఫార్మా అమ్మకపు కంపెనీలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం 75 వేల కోట్ల రూపాయలు. జీవ శాస్త్ర, ఫార్మా, బహుళ ఔషధ పరిశోధన సంస్థలు ఫార్మాసిటీలో రానున్నాయి. ప్రధానంగా వౌలిక సదుపాయాల ఏర్పాటుపై టిఎస్‌ఐఐసి దృష్టిని కేంద్రీకరించింది. అలాగే ఫార్మాసిటీ నుంచి బయటకు, లోపలికి వచ్చే రహదారులపై సమగ్రమైన సర్వే చేశారు. విద్యుత్, రోడ్లు, తాగునీరు, రైల్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సదుపాయాల నిమిత్తం అవగాహన ఒప్పందం ఖరారు కార్యక్రమం వచ్చే ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నిర్దేశించినదాని కంటే అదనంగా 2,600 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఫార్మా కర్మాగారాలు రానున్నందున మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌కు ఎక్కువ స్థలం కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్)ను కూడా నిర్వహించనుంది. అంతకంటే ముందుగానే ఏప్రిల్‌లోగా భూసేకరణ పనులు పూర్తి చేసేందుకు వీలుగా పనులను వేగవంతం చేశారు. ఫార్మాసిటీ అంటే కాలుష్యం వెదజల్లుతుంది. అయతే ఇక్కడ మాత్రం కాలుష్య రహిత ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతంలో దీంతో పర్యావరణ అంచనా అధ్యయనం చేయనున్నారు. ఈ బాధ్యతను ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు నిరుడు డిసెంబర్ 16వ తేదీన అప్పగించారు. వచ్చే ఏప్రిల్ నెలాఖరుకు పర్యావరణ సంబంధిత అంశాలపై అధ్యయనం పూర్తవుతుంది. కాలుష్యంపై నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ పరిశ్రమల నుంచి శూన్యస్థాయిలో కాలుష్యం విడుదల ప్రణాళికను అమలు చేయనుంది. మొత్తం ఫార్మాసిటీకి 2,500 కోట్ల రూపాయలతో ఉమ్మడి వ్యర్థ పదార్థాల శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్లాంట్‌ను బిల్డ్, ఓన్, ఆపరేట్ అనే విధానంపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 1,500 కోట్ల రూపాయల రుణం కోసం కేంద్ర ఫార్మా మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఫార్మాసిటీలో భూముల సేకరణకు హడ్కో రుణం మంజూరు చేసింది. హడ్కో సంస్థ 740 కోట్ల రూపాయలనిస్తోంది. ఇందులో ఫార్మాసిటీకి 550 కోట్ల రూపాయలు, మెదక్ జిల్లాలో నెలకొల్పనున్న నేషనల్ ఇన్విస్టిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు 190 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 350 కోట్ల రూపాయల హడ్కో నిధులను వ్యయం చేసింది. ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన దశ ఉంది. అదే సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక. ఇది ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఈ నివేదికను కేంద్రం పరిశీలనకు పంపి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫార్మా సంస్థలు పెట్టుకోవాల్సిన దరఖాస్తు, భూమి కేటాయింపులు, మార్గదర్శకాలు, భవన నిర్మాణాల మార్గదర్శకాలు ఈ నివేదికలో ఉంటాయి.