బిజినెస్

ఆకట్టుకున్న ఆటో, బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 173.01 పాయింట్లు పుంజుకుని 26,899.56 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.55 పాయింట్లు అందుకుని 8,288.60 వద్ద నిలిచింది. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లతోపాటు మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే గత నెల డిసెంబర్‌లో జోరుగా జరిగిన పన్ను వసూళ్లు మదుపరులను ఉత్సాహపరిచాయి. దీంతో అంతకుముందు రెండు రోజులు నష్టాల్లో కదలాడిన సూచీలు.. మంగళవారం ట్రేడింగ్‌లో మళ్లీ కోలుకోగలిగాయి.
29 వేలకు సెనె్సక్స్.. 9 వేలకు నిఫ్టీ
న్యూఢిల్లీ: మరోవైపు ఈ ఏడాది ఆఖరుకు సెనె్సక్స్ 29,000 వద్ద స్థిరపడవచ్చని డ్యూషే బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది కూడా అనిశ్చితి కొనసాగవచ్చన్న డ్యూషే.. ప్రథమార్ధంలో ఒడిదుడుకులు ఎదురవుతాయని, ద్వితీయార్ధంలో స్థిరంగా ఉండొచ్చని చెప్పింది. ఇదిలావుంటే నిఫ్టీ దీపావళి నాటికి 9 వేల మార్కును అందుకోవచ్చని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అంచనా వేసింది. యుబిఎస్ మాత్రం ఈ ఏడాది చివరకు నిఫ్టీ 8,800 వద్ద నిలుస్తుందని చెప్పింది.

ప్రాపర్టీ టైగర్, హౌసింగ్ డాట్‌కామ్ విలీనం
న్యూఢిల్లీ, జనవరి 10: నిర్మాణ రంగ సంస్థలు ప్రాప్‌టైగర్ డాట్‌కామ్, హౌసింగ్ డాట్‌కామ్ విలీనమై దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కంపెనీగా అవతరించనున్నాయి. వ్యాపార విస్తరణ కోసం ఈ సంస్థ 55 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థలు మంగళవారం తెలిపాయి. న్యూస్ కార్ప్‌నకు చెందినది ప్రాపర్టీ టైగర్ డాట్‌కామ్ అయితే, సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందినది హౌసింగ్ డాట్‌కామ్. కాగా, విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో ఆస్ట్రేలియాకు చెందిన ఆర్‌ఇఎ గ్రూప్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుంది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మరో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతుంది.

17న సిపిఎస్‌ఇ ఇటిఎఫ్ పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ, జనవరి 10: దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం.. సిపిఎస్‌ఇ ఇటిఎఫ్ (ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్)ను ఈ నెల 17న ప్రారంభిస్తోంది. రెండో విడతగా వస్తున్న ఈ ఫాలో ఆన్ ఫండ్ ఆఫర్‌లో భాగంగా 6,000 కోట్ల రూపాయల వరకు నిధులను కేంద్రం అందుకోనుంది. ఈ ఆఫర్ 17న మొదలై 20న ముగుస్తుంది. యాంకర్ ఇనె్వస్టర్లకు 5 శాతం రాయితీ వర్తించనుండగా, రిటైల్, పెన్షన్ ఫండ్లకు షేర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత లభిస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. కాగా, 2014 మార్చిలో సిపిఎస్‌ఇ ఇటిఎఫ్ తొలి విడత షేర్ల ఇష్యూ జరిగింది.

రూ. 29 వేలు పలికిన పసిడి ధర
న్యూఢిల్లీ, జనవరి 10: బంగారం ధర మళ్లీ పుంజుకుంది. మంగళవారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 330 రూపాయలు ఎగిసి 29 వేల మార్కును అధిగమిస్తూ 29,030 రూపాయల వద్ద స్థిరపడింది. ఆభరణాల వర్తకుల నుంచి వ్యక్తమైన డిమాండే కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. కిలో వెండి ధర కూడా 350 రూపాయలు పెరిగి 40,750 రూపాయలను చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయంగానూ సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు పుత్తడి ధర 0.43 శాతం పెరిగి 1,185.90 డాలర్లు పలికింది.