బిజినెస్

పరిశ్రమలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: దేశ ఐటి రంగానికి ఆయువుపట్టులా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి పట్టణాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. మంగళవారం చెన్నైలో ఇండియాటుడే గ్రూపు నిర్వహించిన ది సౌత్ ఇండియా కంక్లేవ్‌లో కెటిఆర్ పాల్గొన్నారు. దక్షిణ భారతంలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలన్న అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ఐటితోపాటు ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని తాము స్టార్ట్ ఆఫ్ స్టేట్‌గా పిలుస్తున్నామని చెప్పారు. కొత్త వ్యాపార ధృక్పథం, పాలసీలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. తాము రూపొందించిన పాలసీలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. టిఎస్ ఐపాస్ లాంటి పాలసీ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని వివరించారు. అనుమతుల ఆలస్యానికి కారణమయ్యే అధికారులపై జరిమానా విధించడం, సెల్ఫ్ సర్ట్ఫికేషన్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పడం, అనేది తెలంగాణలో వాస్తవ రూపం దాల్చిందని, ఈ అంశాన్ని దేశ విదేశాల్లోని పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసించినట్లు ఆయన తెలిపారు. పారదర్శక పాలసీల రూపకల్పనకు సింగపూర్ వంటి దేశాల్లోని పాలసీలను స్పూర్తిగా తీసుకున్నామని, తమ ప్రభుత్వ పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి ర్యాంకులో నిలబడ్డామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య పోటీతోపాటు భాగస్వామ్యం, సమన్వయం సైతం అవసరమని మంత్రి కెటిఆర్ అన్నారు. పెట్టుబడులు ఆకర్షణ కేవలం దేశంలోని రాష్ట్రాల మధ్యనే కాదని, అది ఇప్పుడు దేశాల మధ్య కూడా ఉందన్నారు. అందుకే రాష్ట్రాల మధ్య సమన్వయంతో పరిజ్ఞానం, పాలసీల మార్పిడి, సహకారంతో దేశానికి మరిన్ని పెట్టుబడులు తీసుకునిరావచ్చని సూచించారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ
రెండు రోజుల చెన్నై పర్యటనలో మంత్రి కెటిఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. టివిఎస్, మురుగప్ప, ఎంఆర్‌ఎఫ్, రానే ఇంజనీరింగ్ తదితర సంస్థలతో ఆయన సమావేశమై చర్చించారు. టివిఎస్ లాజిస్టిక్స్ ఎండి దినేష్ బృందంతో మాట్లాడుతూ లాజిస్టిక్స్ రంగంలో ఇప్పటికే అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అతిపెద్ద వేర్ హౌస్‌లను తెలంగాణలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.