బిజినెస్

మోదీ సంస్కరణలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కరణలను, విధానాలను దేశ, విదేశీ పారిశ్రామిక రంగం కొనియాడింది. ముఖ్యంగా పలువురు విదేశీ సంస్థల సిఇఒలు మోదీ నిర్ణయాలను ప్రశంసించారు. మంగళవారం ఇక్కడ జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్ప్, అమెరికాకు చెందిన ఎమర్సన్ ఎలక్ట్రిక్, కెమికల్స్ తయారీ సంస్థ హంట్స్‌మన్ కార్ప్, టెక్నాలజీ దిగ్గజం సిస్కో అధిపతులు మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తదితర కార్యక్రమాలపై పొగడ్తల వర్షం కురిపించారు.
ఇదిలావుంటే రాబోయే ఐదేళ్లలో గుజరాత్‌లో 49,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ మార్చికల్లా 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పూర్తిచేస్తామని చెప్పారు. టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా.. నానో ప్రాజెక్టు గుజరాత్‌ను ఆటోరంగ తయారీ హబ్‌గా మార్చేసిందన్నారు. ఇక దేశ జిడిపి వృద్ధిరేటు 8-10 శాతానికి చేరుకోగలదని సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ అంచనా వేశారు.

చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీతో టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా కరచాలనం