బిజినెస్

పప్పుల మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 10: పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల హోల్‌సేల్ వర్తకానికి కేంద్రమైన రాజమహేంద్రవరంలోని అపరాల మార్కెట్ కుదేలైంది. కొనుగోలు చేసే నాథుడు లేక, గిట్టుబాటు ధర రాక, రైతులు నష్టపోతే, చిల్లర నోట్లు లేక, చిల్లర అమ్మకాలవ్వక, పెట్టుబడులు సమకూర్చుకోలేక వ్యాపారులు చతికిలపడ్డారు. పండుగ సమయంలోనైనా జోరుగా సాగుతాయనుకున్న వ్యాపారం మందగించడంతో వ్యాపారులు బిత్తరపోతున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా సాగే కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు దాదాపుగా స్థంభించిపోయాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో పప్పుల ధరలు తగ్గిపోయాయి. నిరుడు ఇదే పండుగ సమయంలో కిలో కంది పప్పు 210 రూపాయలు అమ్మితే.. ఇపుడు అదే నెంబర్ వన్ రకం కందిపప్పు 80 రూపాయలు, విదేశీ కందిపప్పు 60 రూపాయలకు దిగజారింది. రైతుల వద్ద కొనుగోలు చేసే ముడి సరుకుకు తగిన నగదు ఇస్తే తప్ప కొనలేని స్థితి దాపురించిందని, చెక్కులు, డిడిలు ఇస్తామన్నా పుచ్చుకోని స్థితిలో రైతులు తమ వద్ద ఉన్న సరుకుల అమ్మకాలు నిలుపుదల చేశారు. పది రూపాయలు తక్కువైనా సరే నగదు ఇస్తేనే అమ్ముతున్నారు. కిలో మినపపప్పు హోల్‌సేల్ ధర నిరుడు ఇదే పండగ సీజన్‌లో 180 రూపాయలుగా ఉంటే, ప్రస్తుతం 75 రూపాయలు మాత్రమే. అయతే బియ్యం విషయానికొస్తే మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. బ్రాండెడ్ రకాల బియ్యం వంద కేజీలు 5,300 రూపాయలుంటే, మిగిలిన రకాలు 4,800 రూపాయలుగా ఉన్నాయ. చేరాయి. నిరుడుకు, ఇప్పటికీ సుమారు 500 రూపాయల వరకు ధర పెరిగింది. పాత పెద్ద నోట్ల రద్దుకుముందు రోజుకు సుమారు 15 కోట్ల రూపాయలకుపైగా జరిగిన లావాదేవీలు.. ప్రస్తుతం కోటి రూపాయలకు దిగజారాయని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు చిల్లర వర్తకమంతా కార్పొరేట్ వ్యాపారం వైపు పరుగులు తీస్తోంది. నగదు లభ్యత తక్కువగా ఉండటంతో స్వైపింగ్ మిషన్లు నిర్వహించే కార్పొరేట్ మాల్స్‌వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో రిటైల్ వ్యాపారులు సైతం కుదేలవుతున్నారు.
కొద్ది రోజులుపోతే స్వైపింగ్ మిషన్లు, కంప్యూటర్లు పెట్టలేని వ్యాపార సంస్థలు కనుమరుగయ్యే దుస్థితి దాపురిస్తుందని హోల్‌సేల్ అపరాల వర్తకులు గ్రంధి రామకృష్ణ అన్నారు. మొత్తానికి నూటికి 80 శాతం హోల్‌సేల్ వ్యాపారం పడిపోయిందని ఆందోళన చెందారు. తనకున్న మూడెకరాల్లో పి 31 అనే మినుము రకాన్ని పండించానని, పెట్టుబడి ఖర్చుకు, ధరకు మధ్య వ్యత్యాసం లేకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని రాజానగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన రైతు సూర్యరామకిరణ్ తెలిపారు. మూడెకరాల్లో 900 కేజీల దిగుబడి వచ్చింది. ఈ దిగుబడి సాధించేందుకు అతనికి 54 వేల రూపాయలు ఖర్చయిందని, వ్యాపారి వద్దకు వచ్చి తన సరుకును అమ్మగా కేజీ 62 రూపాయల చొప్పున అమ్మితే, 53 వేల రూపాయలు వచ్చిందన్నారు. ఫలితంగా తనకు 1,000 రూపాయల నష్టమొచ్చిందని, దీనికితోడు తన శ్రమ కూడా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.