బిజినెస్

త్రివర్ణ పతాకం డోర్‌మ్యాట్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: త్రివర్ణ పతాకాన్ని అవమానించే రీతిలో ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌పై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు. అమెజాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, త్రివర్ణ పతాకాన్ని అవమానించే విధంగా ఉండే అన్ని ఉత్పత్తులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సంస్థకు చెందిన ఏ అధికారికి కూడా భారతీయ వీసాను ఇచ్చేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ పని తక్షణమే చేయని పక్షంలో అమెజాన్ అధికారులెవరికీ వీసాను మంజూరు చేసేది లేదని, అంతేకాదు, ఇంతకు ముందు జారీ చేసిన వీసాలను కూడా వెనక్కి తీసుకుంటామని సుష్మ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం ఉండే డోర్‌మ్యాట్‌లను అమెజాన్ కెనడా సైట్‌లో ‘మేయర్స్ ఫ్లాగ్ డోర్‌మ్యాట్’, ఎక్స్‌ఎల్ వైఎల్ అనే రెండు సంస్థలు విక్రయిస్తున్నాయి. ఈ ప్రాడక్ట్‌ల ఫోటోలను సుష్మకు ట్వీట్ చేయడంతో ఆమె దీనిపై స్పందిస్తూ ఈ విషయాన్ని వెంటనే సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని కెనడాలోని భారత హైకమిషన్‌ను ఆదేశించారు.