బిజినెస్

దేశ జిడిపి వృద్ధిరేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 11: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ జిడిపి వృద్ధిరేటును ప్రపంచ బ్యాంక్ బుధవారం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత జిడిపి వృద్ధిరేటు 7 శాతానికే పరిమితం కాగలదని అంచనా వేసింది. ఇంతకుముందు ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.6 శాతంగా, ఆపై ఆర్థిక సంవత్సరం (2018-19)లో 7.8 శాతంగా ఉండగలదని అభిప్రాయపడింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతంగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. పెట్టుబడుల్లో మందగమనం, ఆర్థిక విధానాల్లో అనిశ్చితి ఈ ఏడాది కూడా కొనసాగగలదంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తమ తాజా నివేదికలో అన్నారు. కాగా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్, క్రిసిల్, హెచ్‌ఎస్‌బిసి, సిటిగ్రూప్ వంటి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ జిడిపి వృద్ధిరేటు తగ్గుతుందనే చెబుతున్నాయి. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం.. ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని ఆర్థిక లావాదేవీలు పడిపోయాయని, ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా దిగజారాయని పేర్కొంటున్నది తెలిసిందే.