బిజినెస్

మెరిసిన బ్యాంకింగ్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల మధ్య మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, విద్యుత్ రంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 240.85 పాయింట్లు ఎగిసి రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకుతూ 27,140.41 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 92.05 పాయింట్లు ఎగబాకి రెండు నెలల గరిష్ఠాన్ని చేరుతూ 8,380.65 వద్ద నిలిచింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఆశాజనకంగా నమోదు కావడం బ్యాంకింగ్ రంగ షేర్లలో మదుపరుల పెట్టుబడులకు దోహదం చేసింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలవడం.. భారతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచి లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో నడిచాయి. ఫలితంగా మెటల్ షేర్లు అత్యధికంగా 4.42 శాతం లాభపడితే, బ్యాంకింగ్ 2.40 శాతం, ఫైనాన్స్ 2 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.39 శాతం, యుటిలిటీస్ 1.08 శాతం, పవర్ 1 శాతం, ఇండస్ట్రీ 0.97 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటి షేర్లు మాత్రం స్వల్పంగా 0.02 శాతం నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడితే, చైనా సూచీ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్ సూచీకి లాభాలు, ఫ్రాన్స్, జర్మనీ సూచీలకు నష్టాలు ఎదురయ్యాయి.
30,500 స్థాయికి సెనె్సక్స్
ఈ ఏడాది ఆఖరుకల్లా సెనె్సక్స్ 30,500 స్థాయికి చేరుకోగలదని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం హెచ్‌ఎస్‌బిసి అంచనా వేసింది. పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వంటి నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మున్ముందు బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. నేరుగా లబ్ధిదారులకే సబ్సిడీల ప్రయోజనాన్ని అందించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చేదేనన్న హెచ్‌ఎస్‌బిసి.. దీనివల్ల పెట్టుబడులు పెరిగి స్టాక్ మార్కెట్లు పరుగందుకుంటాయంది.
ఎన్‌ఎస్‌ఇకీ ఆమోదం
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ను బిఎస్‌ఇ ప్రారంభించిన నేపథ్యంలో అక్కడే మరో అంతర్జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్‌ఎస్‌ఇకీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతినిచ్చింది. ఈ మేరకు గ్రీన్‌సిగ్నల్ ఎన్‌ఎస్‌ఇ ఐఎఫ్‌ఎస్‌సి లిమిటెడ్‌కు అందిందని ఓ అధికారి పిటిఐకి తెలిపారు.