బిజినెస్

జిఎస్‌టి సమస్యలు తీరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే కొద్దివారాల్లో ఈ సమస్య పరిష్కారం అవగలదన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. జిఎస్‌టిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గట్టిగా ప్రయత్నిస్తున్నది తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం కలిగిన జిఎస్‌టితో తమ రాష్ట్రాలకు ఇప్పటిదాకా పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం పోతుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన కేంద్రం.. ఈ నెల 16న మరోసారి రాష్ట్రాలతో చర్చించనుంది. ఈ క్రమంలో బుధవారం ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న జైట్లీ.. జిఎస్‌టి వివాదం సమసిపోగలదన్న విశ్వాసాన్ని కనబరిచారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన జిఎస్‌టి.. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి వస్తే అమలైపోతుంది. కాగా, రాష్ట్రాల ఆమోదం కోసం దిగివచ్చిన కేంద్రం.. జిఎస్‌టి అమలుతో వచ్చే నష్టాలను కొంత భరిస్తామని కూడా హామీనిచ్చింది. అయినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు.
ఇదిలావుంటే జిఎస్‌టితోపాటు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని జైట్లీ అన్నారు. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టేలా మారిషస్, సైప్రస్, సింగపూర్ దేశాలతో పన్ను ఒప్పందాలను తిరిగి చేసుకుంటున్నామని వివరించారు.
మరోవైపు జిఎస్‌టి సరళతరంగా ఉంటుందని, పారిశ్రామిక రంగానికి భారం కాబోదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అన్నారు. బుధవారం వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు జిఎస్‌టి ఎంతో హితోధికంగా ఉంటుందని చెప్పారు. ఈ చారిత్రాత్మక పన్నుపై అనవసరపు ఆందోళనలున్నాయన్న ఆయన త్వరలోనే అవన్నీ తొలగిపోయి పన్ను అమల్లోకి రాగలదన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఇక వడ్డీరేట్లు తక్కువగా ఉండాలంటే ద్రవ్యోల్బణం కూడా తక్కువగానే ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అన్నారు. బుధవారం వైబ్రెంట్ గుజరాత్ అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన ఆయన అర్థవంతమైన వడ్డీరేట్ల నిర్మాణంతో దేశ ఆర్థిక వృద్ధిరేటును బలపరిచేలా పెట్టుబడులు రాగలవన్నారు. అలాంటి అర్థవంతమైన వడ్డీరేటు విధానం ఉండాలంటే ద్రవ్యోల్బణం తప్పక అదుపులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
పు

ఏపిలో సుజ్లాన్ పవర్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో 226.8 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు బుధవారం పవన విద్యుత్ టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ గ్రూప్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. ఈ ఏడాది మార్చికల్లా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఈ ప్రాజెక్టు ఉందని వివరించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, సప్లై, ఇన్‌స్టాల్లేషన్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు బిఎస్‌ఇకి సుజ్లాన్ గ్రూప్ తెలియజేసింది. పదేళ్లపాటు టర్బైన్ల నిర్వహణ వ్యవహారాలకూ సుజ్లాన్ హామీదారుగా ఉంటుంది.

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో వృద్ధి
న్యూఢిల్లీ, జనవరి 11: టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 4 శాతం పెరిగాయి. 95,081 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) వాహనాలూ ఉన్నాయి. 2015 డిసెంబర్‌లో 91,762 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్యాసింజర్ వాహన విభాగంలో విదేశీ అమ్మకాలు 64,202 యూనిట్లుగా ఉన్నాయి. క్రిందటిసారి ఇవి 59,287 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం గతంతో పోల్చితే 32,475 యూనిట్ల నుంచి 30,879 యూనిట్లకు పడిపోయాయి.

ఐఎమ్‌ఎ అధ్యక్షుడిగా
డాక్టర్ కెకె అగర్వాల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 11: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్‌ఎ) అధ్యక్షుడిగా డాక్టర్ బిసి రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కెకె అగర్వాల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థ లో 2.8 లక్షల మంది డాక్టర్లు సభ్యత్వం తీసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వైద్యుల సంఘంగా ఐఎమ్‌ఎకు పేరుంది. దేశవ్యాప్తంగా ఐఎంఎకు 1,700 శాఖలున్నాయి. ఈ సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో వైద్యులపై జరుగుతున్న దౌర్జన్యాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామని, డాక్టర్ల నాణ్యమైన సేవలు పేదలకు అందేందుకు కృషి చేస్తామన్నారు.

అగర్వాల్‌ను సత్కరిస్తున్న దృశ్యం

ఐటి, పారిశ్రామిక రంగాల్లో
మైనార్టీలకు ప్రోత్సాహం
ౄ కాంట్రాక్టు పనుల
కేటాయింపులోనూ ప్రాధాన్యత
ౄ అధికారులను ఆదేశించిన
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 11: ఐటి, పారిశ్రామిక రంగాలలో మైనార్టీలను ప్రోత్సహించడానికి ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే కాంట్రాక్టు పనులలో కూడా వారికి ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ప్రగతి భవన్‌లో బుధవారం మైనార్టీ సంక్షేమంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు తయారు చేయాలని, బడ్జెట్‌లో దీనికి కేటాయించాల్సిన నిధులపై ముందుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. మైనార్టీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థలు కాకుండా అవసరమైన చోట మరిన్ని గురుకులాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు ప్రతి నిత్యం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు.