బిజినెస్

అంతర్జాతీయ ప్రమాణాలున్న ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి కృషిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి మారిషస్ సంస్థకు అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని, ఇందుకోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. మారిషస్ కేంద్రంగా పనిచేస్తున్న ‘గోపియో’ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధుల బృందం బాలమల్లుతో బుధవారం ఇక్కడ భేటీ అయ్యంది. గోపియో చైర్మన్ మహేంద్ర ఉచ్చనా నేతృత్వంలో ఒక బృందం బాలమల్లుతో చర్చలు జరిపింది. తమ సంస్థ మారిషస్‌లో పేరెన్నికగన్న ఫైవ్‌స్టార్ హోటళ్లను నడిపిస్తోందని ఉచ్చనా తెలిపారు. హైదరాబాద్‌లో అవసరమైన స్థలం కేటాయిస్తే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. ఇందుకు స్పందించిన బాలమల్లు త్వరలోనే ముఖ్యమంత్రితో ఈ అంశంపై చర్చిస్తానని హామీ ఇచ్చారు.
గొర్రెల పెంపకంపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం
రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై సమగ్రంగా చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గురువారం భేటీ అవుతోంది. తలసాని శ్రీనివాస యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుందని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి.

‘్భరత వృద్ధిరేటు 7.7 శాతం’
న్యూఢిల్లీ, జనవరి 18: భారత ఆర్థిక వ్యవస్థ చైతన్యవంతమైనదని, ఈ డైనమిక్ ఎకానమీ వృద్ధిరేటు ఈ ఏడాది 7.7 శాతం ఉండగలదని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి బుధవారం తెలిపింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధితోపాటు అన్ని ప్రముఖ దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీలు, చివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వృద్ధిరేటు ఈసారి పడిపోతుందంటూ తమ గత అంచనాలను సవరించినది తెలిసిందే. అయినప్పటికీ బలమైన ప్రైవేట్ డిమాండ్, ప్రభుత్వ సంస్కరణలతో జిడిపి వృద్ధి పెరగగలదన్న విశ్వాసాన్ని ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేయడం విశేషం.