బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21.98 పాయింట్లు పెరిగి 27,257.64 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు అందుకుని 8,417 వద్ద నిలిచింది. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులపై పన్నుకు సంబంధించిన వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ క్రమంలోనే మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా 2.27 శాతం నుంచి 0.53 శాతం మేర ఈ రంగాల షేర్ల విలువ పెరిగింది. మరోవైపు ఆసియా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన హాంకాంగ్, జపాన్, చైనా లాభాల్లో ముగిశాయి. 1.16 శాతం నుంచి 0.14 శాతం మేర పుంజుకున్నాయి.