బిజినెస్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాసియా దేశాలే దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 18: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో దక్షిణాసియా దేశాలు కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యుఇఎఫ్)లో పాల్గొన్న ఆమె బుధవారం మాట్లాడుతూ బలమైన ఆర్థిక వృద్ధిరేటు, గణనీయంగా పెరుగుతున్న కొనుగోళ్ల సామర్థ్యంతో దక్షిణాసియా దేశాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయన్నారు. అంతర్జాతీయ డిమాండ్‌లో అగ్రభాగం దక్షిణాసియా దేశాలదే అవుతోందన్న ఆమె దక్షిణాసియాను ప్రపంచం ఇక చిన్నచూపు చూడలేదన్నారు. శ్రామిక బలం కూడా దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగానే ఉందన్న సీతారామన్.. తయారీ రంగం వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడగలదన్నారు. ముఖ్యంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు, భారత్-మయన్మార్-్థయిలాండ్ రహదారి వంటివి మార్కెట్ అవకాశాలను పెంచుతున్నాయని, ప్రాంతీయ సమగ్రతను పెంపొందిస్తున్నాయని చెప్పారు. 180 కోట్ల జనాభాతో, 7 శాతం వృద్ధిరేటును సాధిస్తున్న దక్షిణాసియా దేశాలు.. ప్రపంచంలోని అన్ని అగ్రశ్రేణి సంస్థల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పారు. ఇకపోతే భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పలేదని, పరుగులు పెడుతూనే ఉందని, వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి సభ్య దేశాలకు వివరించారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత్ డిజిటలైజేషన్‌కు సిద్ధంగానే ఉందని చెప్పుకొచ్చారు. భారత వృద్ధిరేటులో సేవా రంగం కీలకమన్న ఆమె ఎనె్నన్నో అవకాశాలకు మేక్ ఇన్ ఇండియా నాంది పలికిందని చెప్పారు. పారిశ్రామిక విప్లవంతోనే అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని, సత్వర పరిష్కార మార్గాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ లావాదేవీలు పుంజుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ నాయకులూ ఇదే మాట చెప్పగా, ఉమ్మడి శత్రువైన పేదరికాన్ని నిర్మూలించేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే సరైన సమయం
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని డబ్ల్యుఇఎఫ్ వేదికగా ప్రపంచ దేశాలకు కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం-2017 సందర్భంగా బుధవారం ఇక్కడ సిఐఐ, బిసిజి నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతున్నామని, భూసేకరణ, పర్యావరణ అనుమతులకు ఎలాంటి అవరోధాలు ఉండట్లేదని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నిశ్చింతగా ముందుకురావచ్చని తెలిపారు. కాగా, ఉద్యోగులు, కార్మికులు మరింతగా నైపుణ్యం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ ఐటిరంగ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న అబీదాలి నీముచ్‌వాలా అన్నారు. సాంకేతికంగా పరుగులు తీస్తున్న ప్రపంచాన్ని అందుకోవాలంటే నైపుణ్యాన్ని పెంచుకోకతప్పదని, ఈ దిశగా అందరూ బాధ్యతతో పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే డిజిటలైజేషన్‌తో ఖర్చు లక్షలాది కోట్ల రూపాయలు తగ్గుతుందని ఓ నివేదిక ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వ్యాపార, పారిశ్రామిక రంగాలు డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. మరోవైపు అసమానత్వాన్ని రూపుమాపేలా విధానకర్తలు కృషి చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లాగార్డే అన్నారు.