బిజినెస్

టెలీనాలో టాటా కమ్యూనికేషన్స్ భారీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: నెదర్లాండ్స్ ఆధారిత టెలీనా హోల్డింగ్స్‌లో అక్కడి తమ అనుబంధ విభాగం (టాటా కమ్యూనికేషన్స్ నెదర్లాండ్స్) పెట్టుబడులు పెడుతున్నట్లు టాటా కమ్యూనికేషన్స్ శనివారం తెలిపింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ వ్యూహాత్మక పెట్టుబడులని టాటా కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. ఈ పెట్టుబడులతో టెలీనా హోల్డింగ్స్‌లో 35 శాతం వాటాను అందుకుంటున్నామని, దీంతో టాటా కమ్యూనికేషన్స్ నెదర్లాండ్స్ ఆ సంస్థలో అతిపెద్ద భాగస్వామిగా అవతరించనుందని పేర్కొంది. గ్లోబల్ మొబిలిటి, ఇంటర్నెట్ సేవల రంగంలో టెలీనా హోల్డింగ్స్ కార్యకలాపాలు కొనసాగుతుండగా, బ్రిటన్, సింగపూర్‌లలోనూ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.

అల్ట్రాటెక్ లాభం
రూ. 594 కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 21: అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 4.7 శాతం పెరిగింది. ఈసారి 593.9 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 566.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఏకీకృత ఆదాయం మాత్రం గతంతో పోల్చితే 6,864.5 కోట్ల రూపాయల నుంచి 6,761 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ మేరకు అల్ట్రాటెక్ సంస్థ శనివారం ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా, సంస్థ ఖర్చులు తగ్గుముఖం పట్టాయి. ఈసారి 5,914.5 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు 6,020.8 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.
యుఎస్‌ఎల్ లాభం
మూడింతలు
న్యూఢిల్లీ, జనవరి 21: లిక్కర్ తయారీ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో మూడింతలు పెరిగింది. ఈసారి 147.70 కోట్ల రూపాయల లాభాన్ని పొందితే, గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 37.23 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆదాయం కూడా గతంతో పోల్చితే 6.16 శాతం ఎగిసి 6,670.72 కోట్ల రూపాయల నుంచి 7,082.22 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ మేరకు ఓ ప్రకటనలో శనివారం యుఎస్‌ఎల్ తెలిపింది.
ఎల్‌అండ్‌టి టెక్ లాభం
17 శాతం క్షీణత
న్యూఢిల్లీ, జనవరి 21: ఎల్‌అండ్‌టి టెక్నాలజీ సర్వీసెస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో సుమారు 17 శాతం క్షీణించింది. ఈసారి 108.7 కోట్ల రూపాయల లాభానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 130.8 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఎల్‌అండ్‌టి శనివారం ఇక్కడ తెలిపింది. ఆదాయం ఈసారి 810.4 కోట్ల రూపాయలుగా ఉండగా, నిరుడుతో పోల్చితే ఇది దాదాపు 4 శాతం అధికం.

పాక్ స్టాక్స్‌లో చైనాకు 40 శాతం వాటా!
కరాచీ, జనవరి 21: పాకిస్తాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 40 శాతం ఈక్విటీ కొనుగోలుకు చైనా సంస్థల కూటమి ఓ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. 85 మిలియన్ డాలర్లతో పాక్ స్టాక్స్‌లో ఈ వ్యూహాత్మక వాటాను చైనా సొంతం చేసుకుంటుండగా, 46 బిలియన్ డాలర్ల విలువైన సిపిఇసి ప్రాజెక్టుకు నిధుల సమీకరణలో భాగంగానే ఈ కొనుగోలు అని తెలుస్తోంది. ఈ కొనుగోలుతో పాకిస్తానీ క్యాపిటల్ మార్కెట్‌లో చైనా ప్రవేశానికి మార్గం సుగమం కానుంది. ఇదే జరిగితే పాకిస్తాన్ విపణిలో చైనా సంస్థల లావాదేవీలు పెరుగుతాయని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా చవక ఉత్పత్తులు పాక్ పరిశ్రమను కుదేలు చేయడం కూడా ఖాయమేనంటున్నారు.