బిజినెస్

చమురు ఉత్పత్తిలో భారత్ వెనుకంజ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 25: ముడి చమురు ఉత్పత్తిలో భారతదేశం పూర్తిగా వెనుకబడి ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్, ఆ సంస్థ చైర్మన్ సీనియర్ అడ్వయిజర్ అతుల్ చంద్ర అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగిన చమురును ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉన్న మన దేశం.. ఇతర దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, ఈ కారణంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియు ప్రాంగణంలో బుధవారం పెట్రోలియం ఇంజినీరింగ్ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన సెమినార్‌కు అతుల్‌చంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముడి చమురు ఉత్పత్తిలో దేశం చాలా వెనుకబడి ఉందని, ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అసెట్స్‌ను ఏర్పాటుచేసుకోవల్సి ఉందన్నారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలలో ఉన్న చమురు ఉత్పత్తి కర్మాగారాలే కాకుండా ఆధునిక సాంకేతిక ప్రక్రియను వినియోగించుకుని వివిధ రాష్ట్రాలలో రిఫైనరీలను ఏర్పాటుచేయడం ద్వారా దేశం ఆర్ధికాభివృద్ధిని సాధింవచ్చని అభిప్రాయపడ్డారు. అయతే ఇందుకు ఆయా ప్రాంతాల్లో భౌగోళిక, సామాజిక, రాజకీయ, సాంఘిక అంశాలను పరిగణలోకి తీసుకుని, రిఫైనరీల ఏర్పాటుకు గల అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. పెట్రోలియం విభాగానికి చెందిన శాస్తవ్రేత్తలు, విద్యార్థులు కూడా ఈ దిశగా కృషిచేయాలని సూచించారు. కాగా, పెట్రోలియం విభాగంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పెట్రోలియం కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడమే కాకుండా, ప్రాపంచిక అంశాల పట్ల పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. జీవితాన్ని మెరుగుపరచుకోవడంలో విద్య పాత్ర కేవలం 10 శాతమేనని, 90 శాతం అనుభవాలు నేర్పిన పాఠాలదేన న్నారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలని, అపుడే ఆయా అంశాలపై పూర్తి అవగాహన కలుగుతుందని అతుల్‌చంద్ర విద్యార్థులకు సూచించారు. సెమినార్ లో జెఎన్‌టియుకె ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కెవి రావు, ప్రొఫెసర్ బి బాలకృష్ణ, హెచ్‌పిసిఎల్ ఆర్‌అండ్‌డి విభాగాధికారి కామేశ్వరరావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, మల్లికార్జునరావు, పివిఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.