బిజినెస్

క్షీణించిన విప్రో లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 25: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 5.8 శాతం క్షీణించింది. 2,114.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2,246 కోట్ల రూపాయలుగా ఉంది. అయినప్పటికీ ఆదాయంలో వృద్ధి కనిపించింది. ఈసారి ఆదాయం 13,764.5 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు 12,951.60 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు బుధవారం సంస్థ తెలియజేసింది. కాగా, ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రెవిన్యూ గైడెన్స్‌ను విప్రో తగ్గించింది. ఇదిలావుంటే బ్రెజిల్‌కు చెందిన ఐటి సర్వీస్ ప్రొవైడర్ ఇన్ఫోసర్వర్ ఎస్‌ఎను విప్రో 8.7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం ఓ ఒప్పందం కూడా కుదిరింది. ఈ కొనుగోలుతో బ్రెజిల్‌లో విప్రో కార్యకలాపాలు విస్తరించనున్నాయి.
పుంజుకున్న మారుతి లాభం
మూడో త్రైమాసికంలో
రూ. 1,745 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, జనవరి 25: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 47.46 శాతం పుంజుకుంది. 1,744.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,183 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడుతో పోల్చితే 13.06 శాతం పెరిగి ఆదాయం ఈసారి 19,173.1 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 16,957.6 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో మారుతి సుజుకి ఇండియా తెలియజేసింది. కాగా, అమ్మకాలు ఈసారి 3,87,251 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 30,748 యూనిట్లుగా నమోదయ్యాయి.
కొటక్ మహీంద్ర లాభం
రూ. 1,267 కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 25: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 35 శాతం పెరిగి 1,266.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 938.31 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 7,670 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,950.41 కోట్ల రూపాయలుగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో కొటక్ మహీంద్ర బ్యాంక్ తెలియజేసింది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) 2.42 శాతం పెరిగాయి.